కరోనా కారణంగా ప్రపంచమంతా ఇల్లే ప్రపంచం చేసుకుని, ఫోనే వైకుంఠం అనుకుంటూ బ్రతికేస్తుంది. కరోనా బారినుండి తమని తాము కాపాడుకోవడానికి గుమ్మం దాటి బయటకి రావట్లేదు. చాలా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ మునుపెన్నడూ లేనంత ఒత్తిడికి గురవుతున్నాయి. తమ ప్రజల ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఆందోళన రోజురోజుకీ పెరుగుతుంది.
ధనిక, పేద, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరినయినా తన కోరల్లో చిక్కుకునేలా చేసే ఈ వైరస్ బారిన సెలెబ్రిటీలు చాలా మందే పడ్డారు. ఎన్ని డబ్బులున్నా, ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటున్నా కూడా ఆ వైరస్ ని ఏమీ చేయలేకపోతున్నారు. తాజగా ఈ వైరస్ దాడికి ప్రముఖ కమెడియన్ కన్నుమూశాడు. బ్రిటన్ కి చెందిన ఎడ్డీ లార్గే 90వ దశకంలో విజయవంతమైన చిత్రాలలో కమెడియన్ గా నటించాడు.
అయితే ఆయనకి కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. హృదయ రోగంతో బాధపడుతున్న 78 సంవత్సరాల ఎడ్డీకి కరోనా సోకడంతో తన ప్రాణాలు కోల్పోయాడు. ఒకప్పుడు అందర్నీ నవ్వించిన ఈ నటుడు కనిపించిన వైరస్ ధాటికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిపెట్టాడు. హృదయ సంబంధ రోగంతో బాధపడుతున్న ఎడ్డీ కరోనాతో చేసిన పోరాటంలో గెలవలేకపోయాడు. ఈ మహమ్మారి ఇంకా ఎంతమంది ప్రాణాలని బలిగొంటుందో...!