సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా కష్టాలు పడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తమలో ప్రతిభ ఉంటే తమని తాము నిరూపించుకోవడానికి ఇప్పుడు చాలా మాధ్యమాలు ఉన్నాయి. కానీ గతంలో అలా కాదు. ప్రతిభ ఉన్నా కూడా అది ఎలా నిరూపించుకోవాలో అర్థం కాకపోయేది. దాంతో అవకాశాలు అంత ఈజీగా వచ్చేవి కావు. అందువల్ల సినీరంగంలో స్థిరపడడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది.
అలా కష్టాలు పడ్డవారిలో రచయిత కోనవెంకట్ కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కోన చాలా కష్టాలని ఎదుర్కొన్నాడట. అయితే వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యాడట. అందుకోసమని నిద్రమాత్రలు తీసుకుని చెన్నై మెరీనా బీచ్ కి వెళ్ళాడట. ఆ టైంలో ఆ బీచ్ కి ఒక అబ్బాయి కాళ్ళు లేని అమ్మాయిని తనతో తీసుకువచ్చాడట.
జనాలందరినీ డబ్బులు అడుగుతూ ఇచ్చిన వాటిని నవ్వుతూ తీసుకుంటున్న ఆమెను చూసిన కోనవెంకట్ లో కాళ్ళు లేని అమ్మాయి ఆ విషయం మర్చిపోయి ఆనందంగా ఉండగలుగుతున్నప్పుడు.. అన్నీ ఉండి పనిచేయగలిగే అవకాశం ఉన్నా ఆత్మహత్య గురించి ఆలోచించినందుకు సిగ్గు పడ్డాడట. అపుడే ఆత్మహత్య ఆలోచనని విరమించుకుని వెళ్ళిపోయాడట.