Advertisementt

‘రెచ్చిపోదాం బ్రదర్’... ఫస్ట్ లుక్ విడుదల

Sat 04th Apr 2020 12:20 PM
rechhipodham brother,first look,ravikiran,ak jampanna,rechhipodham brother movie  ‘రెచ్చిపోదాం బ్రదర్’... ఫస్ట్ లుక్ విడుదల
Rechhipodham Brother First Look Released ‘రెచ్చిపోదాం బ్రదర్’... ఫస్ట్ లుక్ విడుదల
Advertisement
Ads by CJ

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి  ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ శుక్రవారం (ఏప్రిల్ 3) ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని అన్నారు.

చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి, పోసాని, భాను చందర్, ఇంద్రజ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఎందరో నటించారు. ఈ చిత్రంలో పాటలు చాలా ట్రెండీగా, కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ప్రేక్షకులను మా చిత్రం మెప్పిస్తుందని ఆశిస్తున్నా..’’ అన్నారు.

చిత్ర నిర్మాత హనీష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. నేటి యువత‌ను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది’’ అన్నారు.

రవికిరణ్, అతుల్ కులకర్ణి, దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి; డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్: మహేష్ శివన్, డాన్సు: భాను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పి.అర్.ఓ: వీరబాబు, ప్రొడ్యూసర్స్: వివి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు, స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.

Rechhipodham Brother First Look Released:

Rechhipodham Brother First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ