ఈమధ్యన అమలా పాల్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. గత నెలలో అమల పాల్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అని ప్రచారం జరగడం.. తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్‌ని అమలా పాల్ పెళ్లాడిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో... తూచ్ నేను పెళ్లి చేసుకోలేదు అది ఓ బట్టల షోరూం యాడ్ షూట్ అంటూ స్పందించింది. తాజాగా మరోసారి అమలా పాల్ హైలెట్ అయ్యింది. అదేమంటే మణిరత్నం తెరకెక్కిస్తున్న ఓ బడా మల్టీస్టారర్ నుండి అమలా పాల్ తప్పుకుంది. మణిరత్నం సినిమాలో అవకాశం రావడమే అదృష్టమనుకునే హీరోయిన్స్ ఉన్నప్పుడు అమలా పాల్ ఇలా మణిరత్నం సినిమా నుంచి బయటికి రావడం అందరికీ షాకిచ్చింది.
అయితే అమలా పాల్ మాత్రం.. మనకి అవకాశం ఇచ్చారు కదా అని వచ్చిన సినిమా అల్లా ఒప్పుకోలేం... ఇక మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నాకిచ్చిన పాత్రకి నేను న్యాయం చెయ్యలేను అని నాకు అనిపించింది. ఆ పాత్రకు నేను సరిపోను అని నాకు అనిపించినప్పుడు ఆ సినిమా నుండి తప్పుకోవడమే ఉత్తమం అందుకే మణిరత్నం సర్ సినిమా నుండి తప్పుకున్నాను.. అయినా త్వరలోనే మణి రత్నం సర్ సినిమాలో నటించే అవకాశం వస్తుంది అని అనుకుంటున్నాను అంటూ తాను మణిరత్నం సినిమా నుండి ఎందుకు తప్పుకుందో క్లారిటీ ఇచ్చింది అమలాపాల్.