Advertisementt

బన్నీ, సుక్కు.. రెండక్షరాల సెంటిమెంట్..!

Fri 03rd Apr 2020 12:54 PM
allu arjun,sukumar,2 letters title,sentiment,bunny birthday  బన్నీ, సుక్కు.. రెండక్షరాల సెంటిమెంట్..!
Title Sentiment to Allu Arjun and Sukumar Movie బన్నీ, సుక్కు.. రెండక్షరాల సెంటిమెంట్..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల కాంబోలో ఇప్పటివరకు ఆర్య, ఆర్య 2 సినిమాలు తెరకెక్కాయి. అయితే తాజాగా మూడోసారి కూడా అన్ని సెట్ అయ్యి.. సెట్స్ మీదకెళ్లే సమయానికి అల్లు అర్జున్ కి సుకుమార్ కి కరోనా అడ్డం పడింది. సుకుమార్ సినిమా కోసం టోటల్ లుక్ మేకోవర్ చేసిన అల్లు అర్జున్ గెడ్డం పెంచి.. హెయిర్ స్టయిల్ పెంచి చాలా రఫ్ గా మాస్ అవతారమెత్తాడు. సుక్కు సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తాడని ప్రచారం ఉంది. ఇక ఈ సినిమా ఎర్రచందనమ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది అంటున్నారు.

అయితే సుకుమార్ - అల్లు అర్జున్ సినిమా టైటిల్‌గా శేషాచలం అంటూ ప్రచారం జరిగింది. కానీ మూవీ టీం మాత్రం ఆ టైటిల్ కాదు.. మేము టైటిల్ పెట్టగానే ముందు మీకే చెబుతాం అంటూ టైటిల్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈనెల 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని.. సుక్కు - బన్నీ సెంటిమెంట్ ప్రకారం రెండక్షరాలతోనే ఈ సినిమా టైటిల్ ఉండబోతుందని అంటున్నారు. గతంలో ఆర్య, ఆర్య 2 అంటూ రెండక్షరాల్తో సినిమా టైటిల్స్ పెట్టి హిట్ కొట్టిన ఈ కాంబో.. మరోసారి రెండక్షరాల టైటిల్ నే సెట్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి మరో వారం రోజుల్లో సుక్కు - బన్నీ ల టైటిల్ బయటికి రావడం పక్క అంటున్నారు. 

Title Sentiment to Allu Arjun and Sukumar Movie:

2 letters title to Allu Arjun and Sukumar film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ