Advertisementt

‘RRR’కు పోటీగా ప్రభాస్ సినిమా!?

Fri 03rd Apr 2020 08:21 AM
prabhas competition,john,rrr,jakkanna rrr movie,sankranthi  ‘RRR’కు పోటీగా ప్రభాస్ సినిమా!?
Prabhas Competition With RRR Movie! ‘RRR’కు పోటీగా ప్రభాస్ సినిమా!?
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చెక్కిన ‘RRR’ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అదెలాగంటే.. దీనికి చాలానే లెక్కలున్నాయ్. జక్కన్న సినిమాకు ప్రభాస్ పోటీగా రావడమేంటి..? ఇది అస్సలు జరగని పని అనుకుంటున్నారు కదూ.. ఎస్ ఇదే జరగబోతోందట. ఎందుకో.. ఆ లెక్కలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ప్రభాస్‌, పూజాహెగ్దే నటీనటులుగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఇంకా తెరకెక్కించాల్సింది చాలానే ఉందట. ఓవైపు కరోనా మహమ్మారి దెబ్బకు సర్వం వాయిదా పడటం.. మరోవైపు కమిట్మెంట్స్ ఇచ్చిన వారు ఫీలవుతారేమో బాధ ప్రభాస్‌లో ఎక్కువైపోయిందట. ఇవన్నీ ఒక ఎత్తయితే లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలున్నాయనే పుకార్లు సినీ ఇండస్ట్రీకి దడ పుట్టిస్తున్నాయ్. ఈ క్రమంలో ‘జాన్’ చిత్రబృందం నిశితంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చిందట.

అదేమిటంటే.. వచ్చే సంక్రాంతి నాటికి తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ ఏడాది సినిమాపై ఆశలు వదులుకోవాలని.. పైగా ఆగస్ట్ ఆ టైమ్‌లో పెద్ద పెద్ద సినిమాలున్నాయని.. ఇక వచ్చే ఏడాది అయితేనే బెస్ట్ అని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారట. అయితే.. ‘RRR’ రిలీజ్ ఉండటంతో కాస్త గ్యాప్‌లో అయినా సరే సినిమా మాత్రం సంక్రాంతికే థియేటర్లలోకి తీసుకురావాలని ఓ మాట అనేసుకున్నారట. అంటే.. ‘RRR’ కు పోటీగానే సీన్ ఉంటుందన్న మాట. సో ఈ సినిమా రిలీజ్ అయితే గానీ.. ప్రభాస్.. నాగ్ అశ్విన్‌ సినిమా పట్టాలెక్కదు. సో.. వీలైనంత త్వరగానే షూటింగ్, రిలీజ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. మరి ఇది ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

Prabhas Competition With RRR Movie!:

Prabhas Competition With RRR Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ