Advertisementt

మెగా ఫ్యాన్స్‌కు ఏడాది పాటు నిరాశే..!?

Fri 03rd Apr 2020 08:18 AM
bad news for mega fans,megastar chiranjeevi,chiru aacharya movie,koratala shiva,one year  మెగా ఫ్యాన్స్‌కు ఏడాది పాటు నిరాశే..!?
Bad News For Mega Fans Over Chiru Aacharya Movie! మెగా ఫ్యాన్స్‌కు ఏడాది పాటు నిరాశే..!?
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సాదా సీదా జనాలు మొదలుకుని సెలబ్రిటీలు వరకూ తెగ ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు హీరోలైతే కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వకపోవడంతో అసలు ఈ లాక్‌డౌన్ ఎప్పుడు పూర్తవుతుందో..? షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తామో అని అనుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. 152వ చిత్రం ‘ఆచార్య’ కూడా షూటింగ్ ఆపేయడం జరిగింది. ఆ మాటకొస్తే.. అందరికంటే ముందుకు చిరునే ఈ ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మళ్లీ షూటింగ్ మొదలవుతుంది..? ఈ ఏడాది ఇంతకీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయా..? లేదా..? నిజంగానే సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా..? మరో ఏడాదిపాటు నిరాశ తప్పదా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. 

ఇవన్నీ అయ్యే సరికి..!

ఆగస్ట్-14న సినిమా రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ అది అస్సలు జరిగే పనే కాదట. ఎందుకంటే.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టినా చిరుకు సంబంధించి సన్నివేశాలు చాలానే చిత్రీకరించాల్సి ఉంది. ఆ తర్వాత హీరోయిన్‌ ఎపిసోడ్ షూటిం.. ఆ తర్వాత హీరోయిన్-చిరు మధ్య రొమాన్స్, సాంగ్స్ వీటన్నింటికంటే ముఖ్యంగా యంగ్ మెగాస్టార్‌గా కీల‌క పాత్రలో న‌టించే మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పాత్రను చిత్రీక‌రించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేసే సరికి కాస్త అటు ఇటు సినిమా రిలీజ్ చేసే సమయం వచ్చేస్తుంది. పోనీ కాస్త లేట్ అయినా సినిమాను అదే నెల లేదా వచ్చే నెలలో రిలీజ్ చేయాలనకున్న పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయ్. 

ఏడాది పాటు ఎదురుచూపులే!

వీటిలో ‘కేజీఎఫ్-02’, సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా.. ఈ రెండు తప్పించుకుని తర్వాత రిలీజ్ చేసినా పెద్దగా ప్రయోజనమేమీ లేదు. పోనీ సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే.. జక్కన్న చెక్కిన ‘RRR’ ఇంకా సంక్రాంతికి ఒకట్రెండు సినిమాలు ఉన్నాయ్. సో.. వీటికి పోటీకి పోకుండా హాయిగా సమ్మర్‌లో రిలీజ్ చేసుకోవాలన్న మాట. అంటే వచ్చే ఏడాది ఈ టైమ్‌లోనే అన్న మాట. చిత్రబృందం ఇలా అన్ని లెక్కలేసి మరీ వచ్చే ఏడాది సమ్మర్‌కే దాదాపు ఫిక్స్ అయిపోయిందట. ఇదేగానీ జరిగితే మెగాభిమానుల ఆశలు ఆవిరైనట్లే.. ఏడాది పాటు ఎదురుచూపులే. మరి చిత్రబృందం మనసు మార్చుకుని రిలీజ్‌ను ముందుకు తెస్తుందో వేచి చూడాలి.

Bad News For Mega Fans Over Chiru Aacharya Movie!:

Bad News For Mega Fans Over Chiru Aacharya Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ