నాని నటించిన ఎమోషనల్ మూవీ జెర్సీ సినిమాలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గుర్తుండే ఉంటుంది. అందం, అభినయంతో చక్కని ప్రదర్శనని కనబర్చిన శ్రద్దా శ్రీనాథ్ కి జెర్సీ మంచి విజయం దక్కింది. అయితే ప్రస్తుతం ఆమెపై అనేక పుకార్లు వస్తున్నాయి. ఆమెకి కరోనా వైరస్ భయం ఉందని, విదేశీయులతో ఆమె ప్రయాణం చేసిందని..అందువల్ల కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, దానివల్లే అందుకే సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్ళిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లకి ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
కరోనా మెల్ల మెల్లగా భారతదేశంలో వ్యాపిస్తున్న సమయంలో ఆమె హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళిందట. ఆ ట్రావెల్ లో ఆమెతో పాటు వచ్చిన వారెవరికీ కరోనా సోకలేదట. కానీ రిస్క్ తీసుకోవడం అనవసరంగా భావించిన ఆమె తన రిలేటివ్ అయిన డాక్టర్ సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్ళిందట. అంతే తప్ప తనకి కరోనా సోకలేదని.. అంతే కాదు పద్నాలుగు రోజుల ఐసోలేషన్ టైమ్ కూడా పూర్తయిందని... ఇప్పుడు లాక్ డౌన్ ని గౌరవిస్తూ ఇంటి నుండి బయటకి కదలకుండా ఇంట్లోనే ఉండి వాళ్ల అమ్మకి కిచెన్ లో సాయం చేస్తుందట.