Advertisementt

ఆర్ ఆర్ ఆర్ నుండి మరో అప్డేట్ ఆ రోజునే..

Thu 02nd Apr 2020 12:41 PM
ajay devgan,rrr,ntr,ram charan,rajamouli  ఆర్ ఆర్ ఆర్ నుండి మరో అప్డేట్ ఆ రోజునే..
Ajay Devagans look from RRR will release on.. ఆర్ ఆర్ ఆర్ నుండి మరో అప్డేట్ ఆ రోజునే..
Advertisement
Ads by CJ

ఉగాది కానుకగా ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోషన్ పోస్టర్ తో మన  ముందుకు వచ్చిన రాజమౌళి ఆ తర్వాత మరో రెండు రోజులకే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేశాడు. ఈ లుక్ ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. దాంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కరోనా క్రైసిస్ టైమ్ లో వచ్చిన ఈ లుక్ అనేక ప్రశ్నలకి, ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల మళ్ళీ వాయిదా పడుతుందన్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది.

అయితే ఇప్పుడు అందరి ఎదురుచూపులు ఆర్ ఆర్ ఆర్ నుండి వచ్చే ఎన్టీఆర్ లుక్ కోసమే.. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ లుక్ కంటే ముందు మరో అప్డేట్ రానుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఆర్ ఆర్ ఆర్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు అజయ్ దేవగణ్ బర్త్ డే.. ఈ రోజు కూడా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ రావాల్సిందట. అజయ్ దేవగణ్ లుక్ ని ఈరోజు రిలీజ్ చేయాలని అనుకున్నారట.

కానీ కరోనా కారణంగా కొన్ని పనులు బ్యాలన్స్ ఉండిపోవడంతో రిలీజ్ చేయలేకపోయారట. ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కరోనా కల్లోలం పూర్తిగా తొలగిపోయి లాక్ డౌన్ తీసేసినపుడు అజయ్ దేవగణ్ లుక్ ని రివీల్ చేయనున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ లుక్ వచ్చేకంటే ముందే అజయ్ దేవగణ్ లుక్ వచ్చేస్తుందని అర్థం అవుతుంది.

Ajay Devagans look from RRR will release on..:

Ajay Devagan look from RRR will release on 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ