రచయిత కోనవెంకట్, దర్శకుడు శ్రీనువైట్లకి మధ్య విభేధాలు వచ్చి విడిపోయారన్న సంగతి తెలిసిందే. బాద్ షా సినిమాతో వచ్చిన ఈ గొడవలు వారిద్దరి మధ్య బాగా రూరం పెంచాయి. అయినా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి రామ్ చరణ్ తో బ్రూస్ లీ సినిమాకి పనిచేసినప్పటికీ గతంలోలా మ్యాజిక్ రిపీ కాకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే వారిద్దరి మధ్య విభేధాలు ఎందుకు వచ్చాయన్న విషయంలో కారణాలు కోనవెంకట్ గతంలోనే చెప్పాడు. రచయిత రాసిన దానికి క్రెడిట్ ఇవ్వకుండా కేవలం డైరెక్టర్ సెలెక్ట్ చేసాడన్న కారణంగా దాన్ని తన ఖాతాలోకి వేసుకున్నాడని వెల్లడించాడు.
అయితే ప్రస్తుతమ్ వారిద్దరి మధ్య సరైన ర్యాపో లేనప్పటికీ కోనవెంకట్ శ్రీనువైట్ల గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. కోనవెంకట్ రాసిన కథలు శ్రీను వైట్ల దర్శకత్వం చేయడం వల్లే ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు తో చేసిన ఢీ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రెడీ సినిమాలని శ్రీనువైట్ల చేయడం వల్లే హిట్ అయ్యాయని చెప్పాడు. అవే చిత్రాలని వేరే ఏ దర్శకుడు చేసిన అంతలా విజయం సాధించేవి కావని, ఒక్కీ దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుందని, శ్రీనువైట్ల కామెడీని బాగా హ్యాండిల్ చేయగలడని, ఆ విషయంలో ఆయన్ పర్ ఫెక్ట్ అని తెలిపాడు.