కరోనా అంటూ తెలంగాణ ప్రభుత్వం కాస్త త్వరపడగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలోకొచ్చి కరోనాతో కంగారు పడకండి. చేతులని శుభ్రంగా కడుక్కోండి. సామాజిక దూరం పాటించండి అంటూ నీతులు వల్లించాడు. కానీ కరోనా బాధితులకి రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు. యంగ్ హీరోస్ అంతా తలో 20 లక్షలు విరాళం ఇవ్వగా... స్టార్ హీరోలు తమ రేంజ్ విరాళాలిచ్చారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్, నితిన్, వరుణ్, నిఖిల్ ఇలా ఎవరికి వారే కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి, అలాగే సినీ కార్మికులకు విరాళాలిచ్చారు.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా ఫిలింలో నటిస్తున్న విజయ్ దేవరకొండ కనీసం క్రేజ్ కోసం అయినా విరాళం ఇచ్చి ఉండాల్సింది. పాన్ ఇండియా మూవీ అంటే అందరూ విజయ్ సినిమా గురించే మాట్లాడాలి. ఇలాంటి టైంలో కరోనా నిర్మూలనకి భారీ విరాళమిస్తే విజయ్ దేవరకొండ మీదే అందరి చూపు ఉండేది. అలాగే అందరూ మాట్లాడుకునేవారు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం నా వంతు సహాయం ఇది అని చెప్పలేదు. బయటికి రాకపోయినా విరాళం ప్రకటించడానికి విజయ్ కి టైం లేదా అంటున్నారు చాలామంది. అందుకే సోషల్ మీడియాలో రౌడీ స్టార్ ఎక్కడ బాబు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వెతుకులాడుతున్నారట.