Advertisementt

‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో విడుదల

Wed 01st Apr 2020 05:10 PM
jonnavithula ramalingeswara rao,rgv,title logo,ram gopal varma  ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో విడుదల
RGV movie Title logo released ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో విడుదల
Advertisement
Ads by CJ

కార్తికేయ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినికార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో విడుదల మరియు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ది 02-04-2020న మీడియా వారికి విడుదల చేయడం జరుగుతుందని దర్శకుడు జొన్నవిత్తుల తెలిపారు. 

ఈ సందర్భంగా దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు.. తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసపీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే ‘శ్రీరామనవమి’ పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు. 

 

నటీనట వర్గం: సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు.

సాంకేతికనిపుణులు:

ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది

కూర్పు : కార్తీక శ్రీనివాస్

కళ : కృష్ణ చిత్తనూర్

పబ్లిసిటీ : ధనీ ఏలే

సంగీతం : వీణాపాణి

సమర్పణ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం

నిర్మాత : బాల కుటుంబ రావు పొన్నూరి

కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

RGV movie Title logo released:

Jonnavithula Ramalingeswara Rao directs RGV Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ