రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని... టాప్ చైర్ కి దగ్గరైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ ఇలా వరసగా స్టార్స్ తో సినిమాలు చేసే టైం లోనే యంగ్, చిన్న హీరోలతో కమిట్ అయ్యి.. ఎడా పెడా సినిమాలు చేసేసింది. ఓ పక్క పారితోషకం, మరో పక్క చేతినిండా పని ఇలా నాలుగైదేళ్ళ రకుల్ ప్రీత్ విపరీతమైన బిజీగా గడిపింది. అయితే ఎంత త్వరగా ఫామ్ లోకొచ్చిందో.. అంతే త్వరగా ఫామ్ కోల్పోయింది రకుల్ ప్రీత్. కారణం సరైన కథలను ఎంచుకోకపోవడం ఓ కారణమైతే... స్టార్ హీరోలతో నటించేటప్పుడే చిన్న చితక సినిమాలు చెయ్యడం మరో కారణం. అయితే తాజాగా రకుల్ ప్రీత్ చేసిన తప్పు చెయ్యనని చెప్పకనే చెబుతుంది మరో వర్ధమాన నటి, సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ తో భారీ హిట్ కొట్టి... భీష్మ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక వరసగా స్టార్ హీరోల సినిమాల ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఈ ఊపులోనే రష్మిక పారితోషకం డబుల్ చేసేసిందట. అలాగే యంగ్ హీరోస్ అయితే ఓకే కానీ.. చిన్న సినిమాలకు నో చెబుతుందనే టాక్ నడుస్తుంది. చిన్న చిన్న సినిమాలకు కమిట్ అయ్యి డేట్స్ లాక్ అయితే భారీ సినిమాల ఆఫర్స్ చేజారినా చేజారొచ్చని రష్మిక ఉద్దేశ్యం అట. ఇక పారితోషకం పరంగాను రష్మిక చిన్న, మీడియం బడ్జెట్ హీరోలకు అందకపోవచ్చని.. చిన్న అండ్ యంగ్ హీరోలకు నో చెప్పకుండానే పారితోషకం పెంచితే వాళ్లే తన దగ్గరకి రారని.. సో దానితో స్టార్ హీరోల ఛాన్స్ లతో టాప్ చైర్ ఎక్కొచ్చొనేది రష్మిక ప్లాన్ అంటున్నారు కొందరు.