Advertisementt

లాక్ డౌన్ వారిలో విరహాన్ని పెంచింది...

Tue 31st Mar 2020 02:53 PM
gutta jwala,vishnu vishaal,corona virus,covid 19  లాక్ డౌన్ వారిలో విరహాన్ని పెంచింది...
They missed their loved ones because of lockdown లాక్ డౌన్ వారిలో విరహాన్ని పెంచింది...
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ప్రతీ ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ కరోనా వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి అదొక్కతే సరైన మార్గం కనక లాక్ డౌన్ ని ఫాలో అవ్వక తప్పదు. ఎక్కడి వారు అక్కడే నిలిచి పోవడంతో తమ తమ బంధువులని బాగా మిస్సవుతున్నారు. ముఖ్యంగా వేరు వేరు ప్రదేశాల్లో వర్క్ చేసే భార్యాభర్తలకి, ప్రేమికులకి ఈ లాక్ డౌన్ శాపంగా మారింది.

పనిలేక, ఇంట్లో ఒక్కరే ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఈ లిస్ట్ లోకి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల కూడా చేరింది. క్రీడాకారిణిగా కంటే బోల్డ్ కామెంట్లతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న జ్వాల ప్రేమలో ఉంది. తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించిన జ్వాల లాక్ డౌన్ సమయంలో తన ప్రియుడిని కలుసుకోలేక బాగా మిస్సవుతోందిట.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. అయితే వీరిద్దరూ తొందరలో పెళ్ళి చేసుకుని ఒక్కటి కాబోతున్నారట. గతంలో ఆమె ప్రేమలో ఉందని వచ్చిన పుకార్లకి అదేం లేదని చెప్పుకుంటూ వచ్చిన జ్వాల.. ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా పంచుకుంటుంది.

They missed their loved ones because of lockdown:

Gutta jwala missed her loved one Vishnu vishal because of Lockdown

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ