ఈ మధ్యన సినిమాల టైటిల్స్ విషయంలోనో, లేదంటే సినిమా కథలో తన కులాలను కించపరుస్తూ సినిమా డైలాగ్స్ రాసారనో.. ఇలా ఏదో విధంగా కాంట్రవర్సీ అనేది సినిమా విడుదలకు ముందు రచ్చ రచ్చ అవుతుంది. అసలు కాంట్రవర్సీ లేనిదే సినిమా లేదు అన్నట్టుగా తయారైంది ఈ మధ్యన వ్యవహారం. తాజాగా రాజమౌళి కి కూడా RRR సినిమా విషయంలో ఆ తలనొప్పి తప్పదంటున్నారు సినీ నిపుణులు. RRR రౌద్రం రణం రుధిరం అంటూ సరికొత్త టైటిల్ తో రాజమౌళి అల్లూరి సీతారామరాజు.... కొమరం భీం కథలను కలుపుతూ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే అల్లూరి సీతారామారాజు అంటే పంచె కట్టు, మీస కట్టు, గుబురు గెడ్డంతో ఉంటాడు. కానీ రామ్ చరణ్ అలా లేడు. బలీయంగా పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నాడు. ఈ విషయంలో అల్లూరి వారసులు అభ్యంతరం పెట్టినా పెట్టొచ్చని టాక్ వినబడుతుంది.
మరోపక్క ఎన్టీఆర్ ని కొమరం భీం గా ఎలా చూపిస్తాడో అనే దానిమీద ఆసక్తి నెలకొని ఉంది. మరోపక్క అల్లూరి - కొమరం భీమ్ అనేవారు చరిత్రలో ఎక్కడా కలిసిన ఆధారాలు లేవు. కానీ రాజమౌళి తన సినిమా కోసం ఈ ఇద్దరు పాత్రలను కలపబోతున్నాడు. మరి దీన్ని వారి యొక్క వారసులు ఒప్పుకుంటారా? ఇక రాజమౌళి చరిత్ర కారుల పేర్లు పెట్టుకుని... ఈ సినిమాను ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నానని చెప్పడంతో ఈ సినిమా పై కాపీ రైట్ ఇష్యూ వచ్చే అవకాశము లేకపోలేదు అంటున్నారు. ఇక సినిమా విడుదల సమయానికి రాజమౌళి ఈ విషయాల్లో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చెయ్యాలో... RRR విడుదల విషయం రాజమౌళికి కత్తి మీద సామే అంటుంటే.. రాజమౌళికి ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు.