Advertisementt

AA 20.. ఫ్యాన్ మేడ్ బన్నీ లుక్ అదిరిపోలా!

Wed 01st Apr 2020 01:46 PM
allu arjun,aa 20,fan made poster,allu arjun fans  AA 20.. ఫ్యాన్ మేడ్ బన్నీ లుక్ అదిరిపోలా!
AA 20 Fan Made Poster Viral in Social Media AA 20.. ఫ్యాన్ మేడ్ బన్నీ లుక్ అదిరిపోలా!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బంటు పాత్రలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా అదరగొట్టాడు. అల్లు అర్జున్ మ్యానరిజం, అల్లు అర్జున్ స్టయిల్ అలాగే డైలాగ్ చెప్పే విధానం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో అల తో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగింది. ఇక సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ పక్కా మాస్ లుక్ లోకి మారుతున్నాడు. గెడ్డం, హెయిర్ స్టయిల్, బాడీ తో మాస్ లుక్ లోకి ఇప్పటికే మారాడు అల్లు అర్జున్. సుకుమార్ సినిమా కోసం తయారై, తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి కరోనాతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా అల్లు అర్జున్ తన ఇంట్లోనే లుక్ టెస్ట్ లో పాల్గొంటున్నాడనే టాక్ ఉంది.

అయితే అల్లు అర్జున్ లుక్ టెస్ట్ పై న్యూస్ వచ్చిందో లేదో.. అప్పుడే అల్లు అర్జున్... సుకుమార్ సినిమాలో లుక్ అంటూ ఓ ఫ్యాన్ మెడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చేరింది. అల్లు అర్జున్ - సుక్కు సినిమా ఫస్ట్ లుక్ అంటూ అల్లు అర్జున్ మాస్ మసాలా లుక్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అనబడే పోస్టర్ లో అల్లు అర్జున్ పొడవైన జట్టు, గుబురు గడ్డంతో ఎప్పుడూ లేనంత మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సుక్కు సినిమాలో అల్లు అర్జున్ ... లారీ డ్రైవర్‌ పాత్ర చేస్తున్నాడనే ప్రచారానికి.. అల్లు అర్జున్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ గా బాగా సింక్ అవడంతో.. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆ పోస్టర్ ని తెగ వైరల్ చేస్తూ బిజీగా వున్నారు.

AA 20 Fan Made Poster Viral in Social Media:

Allu Arjun Fans likes AA 20 Fan Made Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ