Advertisementt

RRR పనులు జరుగుతున్నాయంటున్న జక్కన్న

Tue 31st Mar 2020 12:29 PM
rrr,rajamouli,shooting,work from home,jakkanna  RRR పనులు జరుగుతున్నాయంటున్న జక్కన్న
Rajamouli About RRR Movie Shooting RRR పనులు జరుగుతున్నాయంటున్న జక్కన్న
Advertisement
Ads by CJ

RRR షూటింగ్ ఆగింది కానీ.. RRR పనులు యధాతదంగా సాగుతున్నాయంటున్నాడు రాజమౌళి. కరోనా ప్రభావంతో షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది అని...... ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ వచ్చిందని తెలిపాడు. కరోనా కారణంగా రెండు రోజుల్లోనే RRR షూటింగ్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది అని... తర్వాత నలుగురు ఆఫీస్ కి వెళ్లి పనులు చేసుకునే వారని.... కాకపోతే కరోనాకి సామాజిక దూరం పాటించాల్సి రావడంతో.. ప్రస్తుతం RRR పనులు ఇంట్లో నుండే జరుగుతున్నాయంటున్నాడు రాజమౌళి. ఇక ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నా అంటే... భారంగా ఎప్పుడూ అనిపించలేదని అంటున్నాడు.

ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి విడివిడిగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌ని హ్యాండిల్ చేస్తూ సినిమాని చెయ్యడం అంతగా భారం అనిపించలేదు. మనం థియేటర్స్ కి వెళితే ఫ్యాన్స్ తక్కువగా ఉండి.. ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ ల ఫ్యాన్స్ నే కాదు... మన RRR సాధారణ ప్రేక్షకుడికి రీచ్ ఇయ్యేలా మోషన్ పోస్టర్ కి వచ్చిన స్పందన చూస్తే తెలుస్తుంది. ఇక చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు..., బయట కూడా మంచి ఫ్రెండ్స్.... వారి స్నేహ బంధం సినిమాకి బాగా పనికొస్తుంది. సో వారితో షూటింగ్ చెయ్యడం చాలా ఈజీ అయ్యింది అంటూ చెబుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.

Rajamouli About RRR Movie Shooting:

RRR Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ