Advertisementt

బాలీవుడ్ స్టార్స్ రియల్ హీరోలే.. హ్యాట్సాప్!

Mon 30th Mar 2020 01:39 PM
bollywood,bollywood stars,real heros,war on corona virus  బాలీవుడ్ స్టార్స్ రియల్ హీరోలే.. హ్యాట్సాప్!
Bollywood Stars Real Heros.. Why Means.. బాలీవుడ్ స్టార్స్ రియల్ హీరోలే.. హ్యాట్సాప్!
Advertisement
Ads by CJ

ప్రపంచం మొత్తమ్మీద వినిపిస్తున్న.. ఎక్కువగా కనిపిస్తున్నది ఒకే ఒక్క ‘కరోనా వైరస్’ అనే పదం మాత్రమే. ఈ కరోనా పేరు చెప్పినా.. వార్తల్లో విన్నా యావత్ ప్రపంచం వణికిపోతోంది.. ఎప్పుడు ఏ దేశానికి వ్యాపిస్తుందో.. ఎవరు దీని బారినపడి కన్నుమూస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. ఆ వైరస్ తీవ్రత అలా ఉంది మరి. ఇవన్నీ ఒక ఎత్తయితే మరో వైపు లాక్‌డౌన్‌తో పేద ప్రజలు, సినీ కార్మికులు, రోజు వారి కూలీలు ఇలా చెప్పుకుంటూ చాలా మందే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమను స్టార్‌లు చేసిన భారతీయులకు అండగా నిలిచేందుకు బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకూ నటీనటులు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

ఇప్పటి వరకూ యావత్ భారత్ వ్యాప్తంగా అత్యధికంగా (సినిమా పరంగా చూస్తే) విరాళాలు అందజేసింది వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. ఈయన ఏకంగా రూ. 25 కోట్లు ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించేశారు. మరోవైపు ఇంకా చాలా మంది నటులే సాయం ప్రకటించారు కానీ పెద్దగా వాళ్లెవరూ హైలైట్ అవ్వలేదు. తాజాగా.. మరో స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ కూడా ‘ప్రజలకోసం నేను సైతం’ తన వంతుగా తన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.

వాస్తవానికి లాక్‌డౌన్‌తో బాలీవుడ్‌కు చెందిన ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. అయితే ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు.. ఇబ్బందుల్లో ఉన్న 25 వేల మందిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు.. బీయింగ్ హ్యూమన్ ప్రతినిధులు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) కార్యాలయానికి వచ్చి ఆ పాతికవేల మంది కార్మికుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోవడం జరిగింది. అయితే.. వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయాలన్నది సల్మాన్ ఆలోచన కావడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు.

Bollywood Stars Real Heros.. Why Means..:

Bollywood Stars Real Heros.. Why Means..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ