Advertisementt

నా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నా: నితిన్

Sun 29th Mar 2020 11:00 PM
nithiin,marriage,postponed,birthday celebrations  నా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నా: నితిన్
Nithiin Marriage Postponed నా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నా: నితిన్
Advertisement
Ads by CJ

రేపు నా పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం లేదు.. ఏప్రిల్ 16న జ‌ర‌గాల్సిన నా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నా:  నితిన్‌

నా అభిమానుల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డివున్నాయో మీకు తెలుసు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ని లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. అందువ‌ల్ల ఎక్క‌డా కూడా నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుప‌వ‌ద్ద‌ని మిమ్మ‌ల్ని ప్రార్థిస్తున్నాను. 

అంతే కాదు, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జ‌ర‌గాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మ‌నమంద‌రం క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సంక్షోభ స‌మ‌యంలో మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మ‌న కుటుంబంతో గ‌డుపుతూ బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌ట‌మే దేశానికి సేవ చేసిన‌ట్లు. ఎల్ల‌వేళ‌లా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే 

మీ.. నితిన్‌

Nithiin Marriage Postponed:

No Birthday celebrations says Nithiin 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ