Advertisementt

నిఖిల్ ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ కిట్స్.. చైతూ 25 లక్షలు

Sun 29th Mar 2020 08:32 AM
nikhil,naga chaitanya,perosonal protection kits,ccc  నిఖిల్ ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ కిట్స్.. చైతూ 25 లక్షలు
Nikhil Donates Perosonal Protection Kits.. Chaitu Donates Rs 25 Lakhs నిఖిల్ ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ కిట్స్.. చైతూ 25 లక్షలు
Advertisement
Ads by CJ

క‌రోనా నివార‌ణ‌కు భారీగా ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ‌

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలానే యావ‌త్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖులు సైతం త‌మ వంతుగా ఆర్ధిక స‌హ‌క‌రాలు అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ కూడా ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి యుద్ధం చేస్తున్న డాక్ట‌ర్స్‌కి, మెడిక‌ల్ సిబ్బందికి చేయుత‌గా వారి ర‌క్ష‌ణ‌కి ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్స్ కిట్స్ భారీగా అందించారు. 

2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు

2000 రీ యూజ‌బుల్ గ్ల‌వ్స్

2000 ఐ ప్రొట‌క్ష‌న్స్ గ్లాస్లులు, శానిటైజ‌ర్లు

10000 ఫేస్ మాస్క‌లు 

ఈ కిట్స్ అన్నిటిని గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేయడం విశేషం. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ క‌రోనా నివార‌ణ మ‌నంద‌రికి ఎంత ముఖ్య‌మో, డాక్ట‌ర్లునీ సైతం ఆ క‌రోనా భారీన ప‌డ‌కుండా, వారికి శ్ర‌మ క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. డాక్ట‌ర్ల‌తో పాటు మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మున్సిప‌ల్ కార్మికులు, అధికారులు మనంద‌రి కోసం ఎలాంటి ప్ర‌మాదాన్ని లెక్క చేయ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. అందుకు నా వైపు కృత‌జ్ఞ‌త‌గా ఈ ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందిస్తున్నాను. క‌రోనా నివార‌ణ జ‌ర‌గాలంటే మ‌నంద‌రం ఇంటిలోనే ఉంటూ ఆరోగ్య ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ 21 రోజుల లాక్ డౌన్ కి మ‌నంద‌రం స‌హ‌క‌రించాలి అని అన్నారు.

 

సినీ వర్కర్స్ కోసం నాగ చైతన్య 25 లక్షల రూపాయల విరాళం

కరోనాను నియంత్రించడానికి పాటిస్తున్న 21 రోజుల లాక్ డౌన్ వలన సినీ పరిశ్రమ స్తంభించింది. షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న పేద సినీ కార్మికుల కోసం సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కి నాగ చైతన్య 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మనకి రోజూ తోడుండే రోజువారీ సినీ వర్కర్స్ కి సహాయం చేయడం కోసం పరిశ్రమ పూనుకోవడం తనని కదిలించిందని, తన వంతుగా వారికి 25 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నట్టు, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని నాగ చైతన్య అన్నారు.

Nikhil Donates Perosonal Protection Kits.. Chaitu Donates Rs 25 Lakhs:

Tollywood Celebrities Donations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ