టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో కూడా కొందరికి ప్రత్యేకపైన పేరు ఉంటుంది. వివి వినాయక్, పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల.. ఇలా ఒక్కొక్కరుగా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. ఆ లిస్ట్ లో ప్రత్యేకంగా చెప్పుకునే వాళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత పేరున్న పేరు హరీష్ శంకర్. రీమేక్ చిత్రాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న హరీష్ శంకర్ ఇటీవల గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.
అయితే హరీష్ శంకర్ డైరెక్టర్ గా మారకముందు రామ్ గోపాల్ వర్మ దగ్గర, అలాగే పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసిన విషయం తెలిసిందే. దర్శకుడిగా మారేముందు చాలా మంది అసిస్టెంట్ డైరక్టర్ గా చేసినవాళ్ళే ఉంటారు. కానీ అసిస్టెంట్ గా చేసే కంటే చాలా ప్రొఫెషన్స్ చేసి ఉంటారు. అలాంటి ఒక ప్రొఫెషన్ నాటకాలు వేయడం గురించి హరీష్ శంకర్ బయటపెట్టాడు.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా హరీష్ శంకర్ తాను నాటకాలు వేసే సమయంలో తీయించుకున్న ఫోటోలని షేర్ చేసాడు. సినిమా జీవితాన్ని అనుకున్న దానికంటే పెద్దగా చూపిస్తుంది. సీరియల్ అనుకున్న దానికంటే చిన్నగా చూపిస్తుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించేది రంగస్థలం అంటూ నాటకాలు వేసే టైమ్ లో తనని నాటకాల రాయుడు అని పిలిచేవాళ్లని గుర్తు చేసుకున్నాడు.