‘అల వైకుంఠపురములో..’ సినిమా షూటింగ్ మొదలుకుని నిన్న మొన్నటి మెగాభిమానులు వర్సెస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ కేంద్రంగా పెద్ద ఎత్తునే గొడవలు జరుగుతున్నాయని.. ఇలాంటి తరుణంలో మెగా ట్యాగ్‌ను వదిలించుకోవడానికి బన్నీ నానా ప్రయత్నాలు చేస్తున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకూ నిజమో కానీ.. వార్తలు మాత్రం బోలెడన్ని వచ్చేశాయ్. దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్‌గా పరిస్థితులు సైతం ఏర్పడ్డాయ్.. ఇరువురూ తిట్టిపోసుకున్నారు కూడా. అయితే ఈ వ్యవహారంపై బన్నీ ఎక్కడా నోరు మెదపలేదు కానీ.. ఏదైనా ఫంక్షన్లలో మాత్రం ‘నా అభిమానులు’ అని పిలవడంతో సీన్ మొత్తం అందరికీ అర్థమైపోయింది. దీంతో అల్లు అర్జున్‌పై ట్రోలింగ్స్ మరింత పెరిగాయి.
అయితే.. తాజాగా ఈ ట్రోలింగ్స్ అన్నింటికీ చెక్ పెడుతూ మెగాస్టార్ చిరంజీవిపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు బన్నీ. అదేమిటంటే.. ఉగాది సందర్భంగా చిరు తొలిసారిగా ట్విట్టర్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆయనకు పలువురు నటీనటులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అయితే బన్నీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో.. ఇదేంటి..? ఇలాంటి టైమ్‌లో పంతాలు పట్టింపులేంటి..? అని ఆయన సన్నిహితులు, ఆప్తులు కాస్త క్లాస్ పీకే సరికి.. ఎట్టలకేలకు ట్వీట్ చేశాడు. మెగాస్టార్ గారినీ హృదయపూర్వంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భం కోసం నేను చాలా రోజులుగా వేచి చూస్తున్నాను. ఫైనల్‌గా చిరుగారు ఇప్పుడు ట్విట్టర్‌లోకి అడుగుపెట్టేశారు’ అని ట్వీట్ చేశాడు.
మొత్తానికి చూస్తే.. ఈ సింగిల్ ట్వీట్‌తో తనపై ట్రోల్ చేస్తున్న వారి మౌత్స్ షట్ డౌన్ చేసేసాడని చెప్పుకోవచ్చు. కాగా.. మెగాస్టార్ అంటే అంటే తనకు చాలా ఇష్టమని.. ఈ విషయాన్ని చాలా సార్లు బహిర్గతం చేస్తూనే వచ్చాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బన్నీ-సుక్కు కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడటంతో కుటుంబ సభ్యులతో బన్నీ తెగ బిజీగా గడిపేస్తున్నాడు.