మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా దెబ్బతో షూటింగ్ అయిపోయింది.‘ఆచార్య’ ఒక్కటే యావత్ సినీ ఇండస్ట్రీ షూటింగ్స్, రిలీజ్‌లను ఆపేసింది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ఇళ్లలో కూర్చోని వాట్ నెక్స్ట్ అంటూ ప్లాన్‌లు గీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సీనియర్ బ్యూటీ త్రిష.. తాను చిరు సరసన చేయట్లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పెద్ద సినిమా.. అది కూడా మెగాస్టార్ సరసన నటించే చాన్స్ మిస్ చేసుకోవడంతో.. తెలుగులో ఈమె మనుగడ కష్టమేనని పుంకాలు పుంకాలుగా కథనాలు వచ్చేస్తున్నాయ్.
ఈ వ్యవహారంపై తాజాగా త్రిష స్పందిస్తూ.. ఇందులో నిజానిజాలెంత అనేది తేల్చేసింది. తాను హీరోయిన్‌గా నిలదొక్కుకున్నదే తెలుగు సినిమాలతో అనే విషయాన్ని గుర్తు చేసింది. అలాంటప్పుడు తాను తెలుగు సినిమాలు చేయనని ఎందుకంటాను.. అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని స్పష్టం చేసింది. ఆ మధ్య తెలుగు నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పానని తెలిపింది. ఇలా ఒకట్రెండు సినిమాల్లో చేయకపోతే పూర్తిగా తెలుగును వదిలేసినట్లేని కొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పుకార్లేనని ఎవరూ నమ్మనక్కర్లేదంది. అసలు నిజం తాను పైన చెప్పిందేనని స్పష్టంగా చేసింది. మెగాస్టార్‌కే నో చెప్పిన ఈ బ్యూటీకి తెలుగులో ఏ మాత్రం అవకాశాలు వస్తాయో జస్ట్ వెయిట్ అండ్ సీ.