Advertisementt

బాలయ్య -మంచు విష్ణు మల్టీస్టారర్ మూవీ..?

Fri 27th Mar 2020 09:21 AM
balayya,balakrishna,manchu vishnu,multi starrer movie  బాలయ్య -మంచు విష్ణు మల్టీస్టారర్ మూవీ..?
Balayya and Manchu Vishnu Multi Starrer Movie! బాలయ్య -మంచు విష్ణు మల్టీస్టారర్ మూవీ..?
Advertisement
Ads by CJ

ఇదేంటి.. టైటిల్ చూడగానే కాస్త ఆశ్చర్యం అనిపించింది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే ఈ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్, మల్టీస్టారర్ ట్రెండ్ యమా నడుస్తోంది. రీమేక్ సినిమాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో జనాలు అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఇలాంటి చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు.  మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ అనే సినిమాను రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రధాన పాత్రలో బాలయ్యను తీసుకోవాలని.. ఆయన భావిస్తున్నారట. అయితే.. ఆయనతో పాటు యంగ్ హీరోను తీసుకోవాలని భావిస్తుండగా మొదట నందమూరి కుటుంబం నుంచే ఎన్టీఆర్ లేదా కల్యాణ్ రామ్‌ను తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. అయితే.. ఆ ఇద్దర్నీ కాదని తాజాగా మరో యంగ్ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆయన మరెవరో కాదు మంచు విష్ణు. ఆయన అయితే బాలయ్యకు సరిగ్గా సెట్ అవుతాడని నిర్మాత భావిస్తున్నాడట. పైగా ఈ పాత్రకు అడిగితే కచ్చితంగా ఒప్పుకుంటాడని ఎందుకంటే.. నందమూరి-మంచు ఫ్యామిలీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన పేరును పరిశీలిస్తున్నారట. మరి ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ ఎవరిదగ్గరికెళ్లి ఆగుతుందో..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Balayya and Manchu Vishnu Multi Starrer Movie!:

Balayya and Manchu Vishnu Multi Starrer Movie!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ