కరోనా కారణంగా రోజు రోజుకీ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కరోన వైరస్ బారినపడకుండా ఉండడానికి జనాలంతా తమ ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. మనదేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ని ఆదేశించారు. పరిస్థితులని అర్థం చేసుకుని ప్రజలంతా లాక్ డౌన్ ని పాటించాల్సిందిగా కోరుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆదేశాలని పాటించకుండా ఇళ్ళనుండి బయటకి రావాలని చూస్తే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది.
ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. దాంతో ప్రభుత్వాల మీద భారం బాగా పడనుంది. ఈ నేపథ్యంలో కరోనా మీద ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి సెలెబ్రిటీలు తమవంతు సాయం చేస్తున్నారు. మొదటగా నిఖిల్ రెండు తెలుగు ప్రభుత్వాలకి ఇరవై లక్షల రూపాయల విరాళం అందించాడు. ఈ రోజు పవన్ కళ్యాన్ రెండు కోట్లు ప్రకటించాడు. పవన్ ని స్ఫూర్తిగా తీసుకున్న రామ్ చరణ్ డెభ్భై లక్షల విరాళం ప్రకటించాడు.
ఆ తర్వాత ఒక్కొక్కరుగా వరుసగా తమ కరోనాని అరికట్టడానికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కోటు రూపాయలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నట్టు ప్రకటించాడు. అలాగే చిరంజీవి దారిలోనే మహేష్ బాబు కోటి ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఐదులక్షలు ప్రకటించింది. ఈ లిస్ట్ లో సినిమా డైరెక్టర్లు కూడా చేరిపోయారు. సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు చిరంజీవితో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్న కొరటాల శివ తలా పదిలక్షలు ప్రకటించారు.