Advertisementt

మెగా ఫ్యాన్స్‌కి హరీష్ నుంచి మళ్లీ ట్రీటుంది

Thu 26th Mar 2020 06:31 PM
harish shankar,pawan kalyan,gabbar singh,latest update,mega fans  మెగా ఫ్యాన్స్‌కి హరీష్ నుంచి మళ్లీ ట్రీటుంది
Again Harish Shankar plans Mega Treat for Fans మెగా ఫ్యాన్స్‌కి హరీష్ నుంచి మళ్లీ ట్రీటుంది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరసగా మూడు సినిమాలు చుట్టేద్దామనుకున్నాడు. కానీ కరోనాతో పవన్ కల కాస్త ఆలస్యం అయ్యేలా కనబడుతుంది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. క్రిష్ సినిమా కొద్దిగా షూట్ చేసారు. ఇక హరీష్ శంకర్ సినిమా మొదలవ్వలేదు కానీ.. ఈసారి హరీష్ శంకర్ మాత్రం పవన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరూ మెచ్చేలా ఓ పవర్ ఫుల్ కథని సిద్ధం చేస్తున్నాడట. గతంలో గబ్బర్ సింగ్ సినిమాని బాలీవుడ్ సినిమాకి రీమేక్ చేసిన హరీష్ శంకర్ ఈసారి రీమేక్ కాకుండా ఓన్ కథతో సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి, క్రేజ్ కి సరిపడా అద్భుతమైన స్క్రిప్ట్ ని హరీష్ రెడీ చేస్తున్నాడని.. గబ్బర్ సింగ్ సినిమాలో, హరీష్ పవర్ ఫుల్ డైలాగ్స్ ఎలా ఐతే పేలాయో... అదే మాదిరి అదిరిపోయే వన్ లైనర్స్, మాస్ మేనరిజం పవన్ కళ్యాణ్ కోసం రాసుకొని వుంచారట. తెరపై హరీష్ రాసిన వన్ లైనర్స్ ఓ రేంజ్ లో పేలడం ఖాయం అంటుంటే పవన్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. వకీల్ సాబ్ రీమేక్.... అందులో మజా లేదు. అలాగే పవన్ హీరోయిజం కనబడదు., ఇక క్రిష్ పిరియాడికల్ మూవీ కాబట్టి.. అందులో పవన్ ఎలా ఉంటాడో ఊహకి అందదు. ఇక హరీష్ సినిమాలోనే పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్, అండ్ స్టయిల్ పవర్ ఫుల్ డైలాగ్స్ చూడడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు.

Again Harish Shankar plans Mega Treat for Fans:

Harish Shankar and Pawan Kalyan Movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ