ఆదా శర్మ.. ఈ బ్యూటీ అందరికీ గుర్తుండే ఉంటుంది.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కాస్త యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఈ హాట్ భామ గురించి చాలానే తెలిసే ఉంటుంది. ఎందుకంటే కావాల్సినంత మసాలా దట్టిస్తుంటుంది గనక.. ఆదా అంటేనే టక్కున గుర్తొచ్చేస్తుంటుంది. అప్పుడెప్పుడో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. యూత్ హార్ట్ బీట్ పెంచేసి ఆ తర్వాత ఒకటి అర సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే.. సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియా ఉంది చాలంతే అన్నట్లుగా.. యమా యాక్టివ్‌గా ఉంటోంది. కుర్రాళ్లంతా నా వెంటే ఉండాలనుకుందో ఏమో గానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పెట్టే హాట్ హాట్ ఫొటోలతో మతి పోగొడుతూ తెగ గిలిగింతలు పెట్టేస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఈ భామ మాత్రం అస్సలు తగ్గట్లేదు.. అంతేకాదండోయ్.. అవసరమైతే ఇంకాస్త డోస్ పెంచుతా అంతేకానీ అస్సలు తగ్గనంటోంది.
కైపెక్కిస్తోందిగా..!
కరోనా నేపథ్యంలో ఇంటి పట్టునే ఉన్న సినీ సెలబ్రిటీలు ఖాళీ సమయంలో తామేం చేస్తున్నామనే విషయాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు, అభిమానులు, ఫాలోవర్స్‌కు తెలియజేస్తున్నారు. కొందరు ట్వీట్స్ రూపంలో.. మరికొందరు మాత్రం వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. ఇదిగో ఆదా శర్మ కూడా ఇందులో భాగంగానే అందాల ఆరబోస్తూ.. పండగ చేస్కోండి అంటూ ఫాలోవర్స్, కుర్రకారు కైపెక్కిస్తోంది. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు.. యోగాలోనూ ఈ బ్యూటీకి బాగా పట్టుంది. అందుకే రోజుకు ఒకట్రెండు ఫిక్చర్స్ లేదంటే వీడియో అన్నట్లుగా పోస్ట్ చేస్తుంటుంది.
టూ మచ్ ఆదా..!
ఈ వీడియోలో.. ఇంట్లో వస్తువుల్ని శుభ్రం చేయడానికి వినియోగిస్తూనే వెరైటీగా ఫ్లోర్ క్లీన్ యోగా చేస్తోంది. యోగా చేయడానికి టైమ్ లేదని చెప్పే వాళ్లకు తాను చెప్పే ఏకైక పరిష్కారం అని చెబుతూ చూపించాల్సినవన్నీ వీడియోలో చూపించేసింది. కరోనాను కూడా ఈ బ్యూటీ ఇలా వాడుకుంటోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.. అందాల భామ ఏ రేంజ్‌లో ఆర బోసిందో తెలుస్తుంది. ఈ వీడియో చూసిన జనాలంతా.. ఇది చాలా టూ మచ్ ‘ఆదా’.. నీ ఆరబోత కాస్త ఆదా చేయండి అంటూ సూచిస్తున్నారు. మరికొందరైతే ఏదైనా నాలుగు సూచనలు చేయాల్సింది పోయి.. ఇలా చేస్తున్నావేంటి..? అని తిట్టిపోస్తున్నారు. వాస్తవానికి ఈ భామకు ఇలాంటి వీడియోలు.. హాట్ హాట్ ఫొటోలు కైపెక్కించడం కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే.