Advertisementt

కాజల్ చేతికి భారీ చిత్రం..?

Wed 25th Mar 2020 01:19 PM
kajal agarwal,tupaki2,murugadoss,vijay  కాజల్ చేతికి భారీ చిత్రం..?
Kajal got another big offer..? కాజల్ చేతికి భారీ చిత్రం..?
Advertisement
Ads by CJ

తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ కి గత కొన్ని రోజులుగా తెలుగులో అవకాశాలే లేవు. లీడ్ రోల్ లో ఆమె నటించిన సీత సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. మొన్నటి వరకు ఆమె చేతిలో విష్ణుతో చేస్తున్న మోసగాళ్ళు తప్ప మరో సినిమా లేదు.. కానీ సడెన్ గా అన్నీ మారిపోయాయి. ఇప్పుడు కాజల్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. త్రిష ఆచార్య నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్ తో భర్తీ చేసారు.

అయితే ప్రస్తుతం ఆమె చేతికి మరో చిత్రం చేరనుందట. తమిళ దర్శకుడు మురుగదాస్ దళపతి విజయ్ హీరోగా తుపాకీ 2 సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకోనున్నారని ప్రచారం జరిగింది. తుపాకీ చిత్రంలో  కాజల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తోన్న తుపాకీ 2 లోనూ కాజల్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి అదే గనక జరిగితే కాజల్ హీరోయిన్ రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.

Kajal got another big offer..?:

Kajal got a huge offer 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ