ప్రస్తుతం పొట్టిపిల్ల రష్మిక హడావిడి మాములుగా లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా యావరేజ్ అయినా.. భీష్మ బ్లాక్ బస్టర్ అవడం.. ఆ సినిమాలో రష్మిక కేరెక్టర్ హైలెట్ అవడంతో.. రష్మిక పాపులారిటీ బాగా పెరిగిపోయింది. రశ్మికకి ఆఫర్సే ఆఫర్స్ వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రశ్మికకి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో అవకాశం రావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా మరో బడా హీరో సినిమా కోసం నిర్మాతలు రష్మికాని సంప్రదించారని న్యూస్ నడుస్తుంది.
చిరు - కొరటాల సినిమా ఆచార్య కోసం త్రిష ప్లేస్‌లోకి కాజల్ అగర్వాల్ వచ్చింది. ఈ విషయాన్ని కాజల్ కన్ఫర్మ్ చేసింది కూడా. అయితే కాజల్ అగర్వాల్ కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుంది అని.... అది కూడా 30 మినిట్స్ గెస్ట్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ కేరెక్టర్ కి ఆ హీరోయిన్ ఉండబోతుంది అని అంటున్నారు. ఇప్పటికే త్రిష అందుకే తప్పుకుంది అని.. రెండో హీరోయిన్ ఉంటే తన స్క్రీన్ స్పేస్ తగ్గుతుంది అని భావించే త్రిష ఆచార్య నుండి వాకౌట్ చేసింది అన్నారు. ఇక రామ్ చరణ్ గెస్ట్ రోల్ కోసం ముందు సమంత, పూజ, కైరా అద్వానీ పేర్లు వినబడినాయి. తాజాగా రామ్ చరణ్ కి జోడిగా పొట్టి పిల్ల రష్మిక పేరు లైన్‌లో కొచ్చింది. అయితే రశ్మికకి అంత సీన్ లేదు.. ఆచార్య సినిమాలో నటించేందుకు రష్మికాని ఎవరూ సంప్రదించలేదు.. ఒకేవేళ సంప్రదిస్తే రష్మిక ఎప్పుడో రివీల్ చేసేసేది అంటున్నారు.