Advertisementt

RRR: ఆలియా తప్పుకోవడం వట్టి పుకారేనా?

Tue 24th Mar 2020 04:13 PM
rrr,aliya bhat,ntr,ramcharan,rajamouli,rrr title logo,ajay devgan  RRR: ఆలియా తప్పుకోవడం వట్టి పుకారేనా?
Aliya is in with Rajamouli RRR: ఆలియా తప్పుకోవడం వట్టి పుకారేనా?
Advertisement
Ads by CJ

రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ గురించి అనేక ప్రచారాలు బయటకి వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కాదని, రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న బాలీవుడ్ భామ ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకుందని వార్తలు ఊపందుకున్నాయి. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆలియా భట్ సినిమా నుండి తప్పుకుందని పుకార్లు షికారు చేశాయి.

ఆలియా భట్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నందున ఆర్ ఆర్ ఆర్ కి డేట్లు ఇవ్వడం కుదరదని అందుకే తాను తప్పుకుందని పుకార్లు పుట్టించారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అది వట్టి పుకారేనని క్లియర్ గా అర్థం అవుతుంది. ఉగాది పర్వదినాన ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగోని రివీల్ చేయనున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రకటననని ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియా కుడా రీట్వీట్ చేసింది.

దీంతో ఆలియా భట్ సినిమాలో నుండి తప్పుకోలేదని క్లియర్ గా తెలుస్తుంది. అంతే కాదు ఒకవేళ తాను తప్పుకున్నట్టయితే సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం బయటకి వెల్లడి చేస్తుందని అర్థం అవుతుంది.

Aliya is in with Rajamouli:

Aliya is in with Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ