Advertisementt

హమ్మయ్యా.. బాలయ్యకు ఇద్దరు భామలు ఫిక్స్!

Wed 25th Mar 2020 06:59 AM
heroines,anjali,shreya,balayya,balakrishna,boyapati  హమ్మయ్యా.. బాలయ్యకు ఇద్దరు భామలు ఫిక్స్!
Heroines Fix For Balayya-Boyapati Movie! హమ్మయ్యా.. బాలయ్యకు ఇద్దరు భామలు ఫిక్స్!
Advertisement
Ads by CJ

నంద‌మూరి బాల‌కృష్ణ- బోయపాటి కాంబోలో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు ఇది 106వ సినిమా కావడంతో కాసింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు..? అనే విషయం తెలియరాలేదు కానీ.. పుకార్లు మాత్రం బోలెడన్ని వచ్చాయ్. ఇదిగో ఈ బ్యూటీని తీసుకుంటున్నారు.. అదుగో ఆ బాలీవుడ్ భామను తీసుకుంటున్నారు.. అబ్బే తెలుగు హీరోయిన్‌నే తీసుకుంటున్నారు అని ఇలా చాలానే పుకార్లు వచ్చాయి. అయితే.. ఫైనల్‌గా ఈ హీరోయిన్‌ల ఎంపిక బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దగ్గర వచ్చి ఆగిందని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అబ్బే అదేం లేదని తేల్చేసింది.

ఆ తర్వాత శ్రియ, అంజలీ, నయనతార, అనుష్క ఇలా చాలా మంది దగ్గర బంతి వచ్చి ఆగిందని వీళ్లలో ఇద్దర్ని ఫైనల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వచ్చాయ్. అంతేకాదు.. వీలైనంత త్వరగా హీరోయిన్ వ్యవహారం తేల్చాలని కరోనా కర్ఫ్యూ అవ్వగానే రంగంలోకి దిగాలని బోయపాటికి చెప్పగా.. ఆయన వెతికి వెతికి మరీ పట్టేశారట. ఇప్పటికే అంజలిని ఫైనల్ చేసింది టీమ్.. తాజాగా శ్రియాను కూడా సెకెండ్ హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాది లేదా మార్చి-31 తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇదివరకే వీళ్లిద్దరూ బాలయ్యతో నటించిన భామలే. సో.. మరోసారి కాంబో రిపీట్ కానుందన్న మాట. నిజానిజాలు తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Heroines Fix For Balayya-Boyapati Movie!:

Heroines Fix For Balayya-Boyapati Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ