Advertisementt

ఫైనల్‌గా ఈ ఇద్దరిలో మహేశ్ ఓటు ఎవరికో!?

Tue 24th Mar 2020 07:08 PM
mahesh babu,superstar mahesh,venky kudumula,geetha govindam parasuram,vamsi,puri  ఫైనల్‌గా ఈ ఇద్దరిలో మహేశ్ ఓటు ఎవరికో!?
News About Mahesh Babu Movies! ఫైనల్‌గా ఈ ఇద్దరిలో మహేశ్ ఓటు ఎవరికో!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అసలు ఎవరికి ఓకే చెప్పాలో..? ఎవరి కథ ఫైనల్ చేయాలో..? అనేది దిక్కు తోచట్లేదట. కథలేమో బోలెడన్ని వచ్చాయ్.. వీటిలో దాదాపు అన్నీ నచ్చాయ్.. మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది.. వీటిలో ఏది ఫైనల్ చేయాలి..? ఏ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆలోచనలో పడ్డాడట. వాస్తవానికి ‘మహర్షి’తో మంచి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లితో చేయాల్సి ఉన్నప్పటికీ.. అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్‌తో చేయాలని మహేశ్ ఎప్పుడో నిర్ణయించాడని.. కథ కూడా వినిపించేశాడని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్‌ మొదలెట్టే యోచనలో ఉన్నట్లు గత నెలలో వార్తలు వచ్చాయ్. 

ఇక అసలు విషయానికొస్తే.. పరశురామ్‌తో మే 31 నుండి సినిమా లాంచ్ చేయడమా లేకుంటే.. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేయడమా..? అసలు వీరిద్దరిలో ఎవరికి ఓటెయ్యాలి..? వీరిద్దరూ కాకుండా బ్యాక్ టూ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అందామా..? అసలేం చేయాలో సూపర్ స్టార్‌కు తోచట్లేదట. ఎక్కువ శాతం అయితే పరుశురామ్, వెంకీ కుడుమల ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫైనల్ ఓటేస్తారని తెలుస్తోంది. మరి ఆ ఇద్దరిలో ఎవరికి..? అనేదానిపై ఇటు మహేశ్ అభిమానుల్లో.. ఔత్సాహికులు, సినీ ప్రియుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేశ్ మనసులో ఏముందో తెలియాలంటే ఆచితూచి ఎంచుకుని ప్రకటన చేసే వరకూ వేచి చూడక తప్పదు మరి.

News About Mahesh Babu Movies!:

News About Mahesh Babu Movies!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ