Advertisementt

కొరటాలా.. ఏంటీ కన్ఫూజన్.. క్లారిటీ ఇవ్వు!

Mon 23rd Mar 2020 10:52 PM
confusion,koratala shiva,aacharya,chiru-koratala movie   కొరటాలా.. ఏంటీ కన్ఫూజన్.. క్లారిటీ ఇవ్వు!
Why Confusion Koratala.. Give Clarity! కొరటాలా.. ఏంటీ కన్ఫూజన్.. క్లారిటీ ఇవ్వు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా దెబ్బతో షూటింగ్ అయిపోయింది.‘ఆచార్య’ ఒక్కటే యావత్ సినీ ఇండస్ట్రీ షూటింగ్స్, రిలీజ్‌లను ఆపేసింది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ఇళ్లలో కూర్చోని వాట్ నెక్స్ట్ అంటూ ప్లాన్‌లు గీసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కొరటాల మాత్రం అసలేం చేస్తున్నారో..? ఏంటో..? అర్థం కాని పరిస్థితి. మరీ ముఖ్యంగా.. ‘ఆచార్య’ విషయంలో రోజురోజుకూ కన్ఫూజన్స్ ఎక్కువవుతున్నప్పటికీ క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు మిన్నకుండిపోతున్నారో అస్సలు అర్థం కావట్లేదు.

వాస్తవానికి సీనియర్ బ్యూటీ త్రిష.. తాను చిరు సరసన చేయట్లేదని చెప్పిన తర్వాత ఇదిగో ఈ బ్యూటీని కన్ఫామ్ చేసేశారు.. అబ్బే కాదు ఆ బ్యూటీనే ఫిక్స్ చేసేశారు.. చిరు సరసన ఈ భామే.. చెర్రీ సరసన ఫలానా భామ ఇలా చిత్ర విచిత్రాలుగా వార్తలొచ్చేశాయ్. అంతేకాదు.. తాజాగా చిరు సరసన కాజల్ అని.. చెర్రీతో రష్మిక రొమాన్స్ చేయనుందని ఫైనల్‌గా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు పేర్లే టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయ్. అయితే రోజురోజుకూ పుకార్లు ఎక్కువవుతండటం.. రకరకాలుగా కథనాలు వచ్చేస్తుండటంతో అసలు ఏది నమ్మాలో..? ఏది నమ్మకూడదో తెలియక మెగాభిమానులు తలలు పట్టుకుంటున్నారట.

సినిమాకు సంబంధించి ఏమైనా పొరపచ్చాలు ఉంటే మాత్రమే స్పందించే దర్శకనిర్మాతలు.. ఇలాంటి వార్తలపై ఎందుకు స్పందించట్లేదు. పోనీ ఇవన్నీ పుకార్లే అనుకుంటే హీరోయిన్‌ ఇదిగో ఈ భామనే తీసుకుంటున్నామని ఒక్క మాట చెబితే ఏమవుద్ది కొరటాలా..? సినీ ప్రియులు, మెగాభిమానుల్లో ఇంత కన్ఫూజ్ చేయటమెందుకు..? ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేస్తే పోలా..? ఇకనైనా పుకార్లకు చెక్ పెట్టి క్లారిటీ ఇస్తారో..? అభిమానులను కన్ఫూజన్‌తో నడిపించేస్తారో..? వేచిచూద్దాం.

Why Confusion Koratala.. Give Clarity!:

Why Confusion Koratala.. Give Clarity!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ