నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ మూడు తరాలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాయ్ కానీ.. నాలుగో తరం వస్తుందో..? రాదో..? అనేది ఇప్పట్లో డౌటే. అయితే తాను క్రీజులో ఉన్నప్పుడే కుమారుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య ఎంతో తహతహలాడుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అస్సలు అనుకూలించట్లేదు. అంటే.. ఆ పరిస్థితులేంటి..? పరిస్థితులు సహకరించట్లేదా..? మోక్షజ్ఞనే సహకరించట్లేదా..? అనేది మాత్రం ఇక్కడ అనవసరం.. అసందర్భం కూడా.
కచ్చితంగా సినిమా చేస్తా!
ఇక అసలు విషయానికొస్తే.. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతూ సూపర్ హిట్ దర్శకుడిగా అనీల్ రావిపూడి పేరుగాంచిన సంగతి తెలిసిందే. జూనియర్ నుంచి సీనియర్, స్టార్ హీరోలతో కూడా సినిమా తీయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఈయన కోసం హీరోలు క్యూ కడుతున్నారు. అయితే.. తాజాగా ఓ షో వేదికగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. అదేమిటంటే.. తాను బాలయ్యతో.. మోక్షజ్ఞతో సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పేశాడు. అంతేకాదు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తన్న టైమ్‌లో గదిలోని గోడకి, మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ దిగిన ఫొటో ఉండేదని.. అది చూసినప్పుడల్లా మోక్షజ్ఞతో తప్పకుండా ఒక సినిమా చేయాలనిపించేదన్నాడు. అంతేకాదు.. ఇద్దరితో వీలుకాకపోతే.. ఇద్దర్నీ కలిపి మల్టీస్టారర్ సినిమా కూడా చేసే ఆలోచన ఉండేదని చెప్పేశాడు.
ఇంతకంటే కష్టమే!
సో.. ప్రపోజల్ అయితే వచ్చేసింది.. ఇక ఆలస్యం చేయాల్సిన అక్కర్లేదు బాలయ్య.. మోక్షజ్ఞను రెడీ చేసి వెంటనే అనిల్‌కు అప్పగించేసెయ్ అని నందమూరి అభిమానులు చెబుతున్నారు. బాలయ్య ఏమంటాడో..? ఆయన మనసులో ఏముందో..? మరి. వాస్తవానికి బాలయ్కకు ఇంతకంటే మంచి డైరెక్టర్ దొరకటం ఇప్పట్లో కష్టమే.. ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మంచిదేమో.!