అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ మాటల మాయాజాలం, అల్లు అర్జున్ నటన వెరసి అల వైకుంఠపురములో భారీ హిట్ అయ్యింది. ఈ సినిమాకి తన తండ్రి నిర్మాతను భాగస్వామిగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఎప్పటిలాగే తన పారితోషకాన్ని అందుకున్నాడట. అల్లు అరవింద్ ఈ విషయాన్ని అందరి ముందు చెప్పాడు. తనకు కొడుకైన అందరిలాగే బన్నీ పారితోషకాన్ని సినిమా విడుదలకు ముందే ఇంటికి పంపేసా అన్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. మాస్ లుక్ కోసం బన్నీ కష్టపడుతున్నాడు. హెయిర్ స్టయిల్, రఫ్ గా గడ్డం, బాడీ లాంగ్వేజ్, భాష కోసం ట్యూషన్ అన్నిటి కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నాడు.
కరోనాతో ఇంట్లో ఉన్న అల్లు అర్జున్, సుకుమార్ సినిమా కోసం లుక్ టెస్ట్ చేయించాడట. ఇక తాజాగా సుక్కు సినిమా కోసం అల్లు అర్జున్ భారీ పారితోషకం పెంచేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అల వైకుంఠపురములో సినిమాకి 15 కోట్లు అందుకున్న బన్నీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సుక్కు సినిమా కోసం బన్ని డబుల్ రెమ్యూనరేషన్ అడిగాడని, అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా మైత్రి వారు కూడా బన్నీ అడిగిన అమౌంట్ ఇవ్వడానికి సిద్దమయ్యారనే టాక్ నడుస్తుంది.