తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయం అవుతుంటారు.. టాలెంట్, అందం, అభినయం ఉంటే తెలుగులో అవకాశాలకు అస్సలే కొదవుండదు. ఒకే ఒక్క సినిమా హిట్ పడితే ఇక ఆ భామ పేరే కాదు.. రేంజ్ కూడా ఎక్కడికో వెళ్లిపోతుంది. అయితే ఇది ఒకప్పటి పరిస్థితి. చేసింది ఒక్క సినిమానే అది కూడా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు.. సింగిల్ సాంగ్ మాత్రమే బయటికొచ్చింది.. ఇప్పుడు ఆ భామ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.. ఇది ఇప్పటి పరిస్థితి. ఈ బ్యూటీ మరెవరో కాదండోయ్.. కృతి శెట్టి. ఎవరబ్బా ఈ భామ అని అనుకుంటున్నారా.. అదేనండోయ్.. ‘నీ కన్ను నీలి సముద్రం’ అని పాట విన్నారు కదా.. ఆ పాటలో ఉండే బ్యూటీనే కృతి.
ఇప్పటికే ‘18’ పేజీల్లో!
ఈ పిల్ల తెలుగులో నటించింది ఒకే ఒక్క సినిమా.. అది కూడా ఇంకా పూర్తిగా షూటింగ్ పూర్తి కాలేదు కానీ అవకాశాలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా డేట్స్ ఇచ్చేస్తుందేమో అని ఈ కన్నడ బ్యూటీని తెగ బుక్ చేసేసుకుంటున్నారట. ఇప్పటికే.. యంగ్ హీరోగా నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘18 పేజెస్’ చిత్రంలో నటిస్తోందని.. సుకుమార్ రెకమెండేషన్‌తో ఈ పిల్లను తీసుకున్నారని వార్తలు వినిపించిన విషయం విదితమే. అయితే ఇంతవరకూ అధికారిక ప్రకటన రాలేదు కానీ.. తాజాగా మరో బంపరాఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
‘పాగల్’ గాడి పక్కన!?
విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ అనే చిత్రాన్ని నరేశ్ కుప్పిలి తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ కరోనా ప్రభావంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లో హీరోయిన్, నటీనటులు వెతికే పనిలో దర్శకనిర్మాతలు నిమగ్నమయ్యారు. అయితే.. హీరోయిన్‌గా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అందం, అభినయం.. నటన అదుర్స్ అనిపించేలా ఉండటంతో ఆ పిల్లనే ఫిక్స్ చేసేశారట. మార్చి 31న లేదా ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలని.. అప్పుడే అధికారికంగా ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంటే సింగిల్ సినిమా రిలీజ్ కాకమునుపే.. ఒకే ఒక్క పాటతో దర్శకనిర్మాతలు, యూత్‌ను ఫిదా చేసేసిందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే నిజమైతే.. రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకోవడం నిజంగా కృతిశెట్టి అదృష్టమే. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.