కరోనా వైరస్ కారణంగా ప్రతీ ఇండస్ట్రీ పెద్ద సంక్షోభంలో పడిపోయింది. ఆర్థికంగా ప్రతీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. చిత్ర పరిశ్రమ కూడా దీనికి అతీతమేమీ కాదు. ఎన్నో సినిమాల విడుదల తేదీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎన్నో సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరకమైన స్తబ్దతని ఎదుర్కొంటుంది. అయితే సినిమాల రిలీజ్ లు, షూటింగ్ లే కాదు కొత్త సినిమా లాంచింగ్ లు కూడా ఆగిపోయాయి.
తెలుగు వారికి పర్వదినమైన ఉగాది రోజు ఎన్నీ సినిమాలు లాంఛనంగా ప్రారంభమయ్యేవి. ఎప్పటి నుండో ఊరిస్తున్న మహేష్ పరశురామ్ ల కాంబినేషన్ లో సినిమా లాంచింగ్ ఉగాది నాడు ఉంటుందని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడిపోయింది. ఈ లిస్ట్ లో మహేష్ ఒక్కడే కాదు.. చాలా మంది ఉన్నారు. రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కే పీరియాడికల్ డ్రామా మూవీ, తేజ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందనున్న చిత్రం, విలక్షణ దర్శకుడైన విక్రమ్ కె కుమార్ నాగచైతన్యతో చేయబోయే సినిమా కూడా ఉగాది నాడు లాంచింగ్ జరుపుకునేవి.
కానీ కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రాల లాంచింగ్ వాయిదా పడింది. మళ్లీ అన్నీ సజావుగా సాగి ఈ చిత్రాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో..!