Advertisementt

వారిద్దరితో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ తీస్తాడట..

Mon 23rd Mar 2020 02:37 PM
anil ravipudi,balakrishna,mokshaghna,balayya  వారిద్దరితో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ తీస్తాడట..
Anil Ravipudi wants to direct Mokshaghna వారిద్దరితో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ తీస్తాడట..
Advertisement
Ads by CJ

తెలుగులో ఓటమినెరుగని దర్శకులు ఎవరని చూసుకుంటే ఆ లిస్ట్ లో చాలా తక్కువ మంది పేర్లు కనబడతాయి.  అయితే ఫ్లాపులే ఎరగని డైరెక్టర్లలో మొదటగా రాజమౌళి రాగా, సెకండ్ ప్లేస్ లో కొరటాల శివ ఇంకా అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా ఒక్కోసారి ఫ్లాప్ సినిమాలు తీయడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ముగ్గురు దర్శకులు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా తీయలేదు.

వీరిలో అనిల్ రావిపూడి గురించి చెప్పుకోవాలి. తన మొదటి సినిమా పటాస్ నుండి మొన్న సరిలేరు నీకెవ్వరు వరకు ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పోతున్నాడు. చాలా తక్కువ కాలంలోనే మహేష్ లాంటి స్టార్ తో సినిమా చేయడం అనిల్ కే చెల్లింది. అయితే అనిల్ కి ఒక డ్రీమ్ ఉందట. ఎప్పటికైనా బాలక్రిష్ణ కొడుకుతో సినిమా చేయాలని ఉందట. బాలక్రిష్ణ, మోక్షజ్ఞతో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందట.

అయితే అనిల్ కోరిక ఇప్పట్లో నెరవేరుతుందా అంటే సందేహమే. అనిల్ వంటి కమ్ర్షియల్ చిత్రాల దర్శకుడితో మోక్షజ్ఞని లాంచ్ చేస్తే బాగానే ఉంటుంది. అదీగాక ఇప్పుటివరకు అనిల్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే కాబట్టి సెంటిమెంట్ గా కూడా వర్కౌట్ అవుతుంది. మరి అనిల్ కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో చూడాలి.

Anil Ravipudi wants to direct Mokshaghna:

Anil Ravipudi wants to direct a movie with balakrishna and his son

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ