అమలాపాల్ గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూ ఉంది. విజయ్ తో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఆమె సింగిల్ గానే ఉంటోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గాయకుడు భవిందర్ సింగ్ తో పెళ్ళయినట్టుగా ఫోటోలు బయటపడ్డాయి. అయితే అవి ఎక్కడి నుండో వస్తే నమ్మేవారు కాదేమో.. కానీ అవి నేరుగా భవిందర్ సింగ్ ఇన్స్టా ఖాతాలోంచి రావడంతో నమ్మక తప్పలేదు.
ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వాటిని భవిందర్ సింగ్ డిలీట్ చేశాడు. అదీ కాకుండా తన పెళ్ళిపై అమలాపాల్ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమలాపాల్ తన పెళ్ళిపై వస్తున్న వార్తలని ఖండిస్తుందట. ఆన్ లైన్లో విడుదల అయిన ఆ ఫోటోలు ఏదో బిజినెస్ కి సంబంధించిన ఆడ్ ఫోటోలని చెప్పిందని సమాచారం.
మొత్తానికి తాను పెళ్ళి చేసుకోలేదని, చేసుకుంటే ఆ విషయాన్ని సీక్రెట్ గా దాచిపెట్టాల్సిన అవసరం ఏం ఉంటుందని అంటుందట. కానీ జనాలు అమలా పాల్ చెబుతున్న విషయాన్ని నమ్మేలా కనబడట్లేదు. ఇన్స్టాలో పోస్ట్ చేసి మరీ డిలీట్ చేయడంతో అమలా పాల్ కి ఖచ్చితంగా పెళ్ళి జరిగిపోయిందని కన్ఫర్మేషన్ ని వచ్చేశారు.