కనికా కపూర్.. ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న పేరు. బాలీవుడ్ సింగర్ అయిన ఈమెకు కరోనా పాజిటివ్ తేలింది. విదేశం నుండి ఇండియాకి వచ్చిన ఈ సింగర్ హోమ్ క్వారంటైన్ నియమాన్ని ఉల్లంఘించి పార్టీలో పాల్గొనడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలీ మంత్రులతో పాటు రాష్ట్రపతి భవన్ సభ్యులు కూడా ఉండడం గమనార్హం. కనికా చేసిన పనికి పార్టీకి వచ్చిన వారందరూ హడలి చస్తున్నారు.
అయితే విదేశాల నుండి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. మరి కనికాకి ఈ పరీక్షలు నిర్వహించలేదా, లేక ఆమె ఈ పరీక్షల నుండి తప్పించుకుందా అన్న అనుమానం కలిగింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ప్రకారం కనికా స్క్రీనింగ్ టైమ్ లో బాత్రూంలో దాక్కుని ఉండి స్క్రీనింగ్ నుండి తప్పించుకుందని విమర్శలు చేశారు.
తాజాగా ఇలాంటి వార్తలపై కనికా క్లారిటీ ఇచ్చింది. తాను బాత్రూంలో దాక్కోలేనని, అలా దాక్కోవడం కుదరదని, తనకి కూడా స్క్రీనింగ్ చేశారని, కావాలంటే ఏయిర్ పోర్ట్ సీసీటీవీ ఫుటేజీ చూసుకోమని చెప్పింది. మొత్తానికి ఏదేమైనా కరోనా వల్ల ఆందోళన చెందుతున్న వారికి, ఆ ఆందోళనని తన చేష్టల ద్వారా మరింత పెంచింది.