ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది. నేడు కరోనా కనెక్షన్ ని కట్ చేసేందుకు ఎవరికి వారు స్వయంగా ఇళ్ళలో నుండి బయటకి రాకుండా జనతా కర్ఫ్యూని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కర్ఫ్యూని మార్చ్ ౩౧ వరకు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ తో సహా మరో సంగారెడ్డి, మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలని లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. చాలా మటుకు సినిమాలన్నీ షూటింగ్ చివరి దశకు వచ్చి ఆగిపోయాయి. మళ్ళీ కరోనా ప్రభావం తగ్గితే గానీ షూటింగ్స్ స్టార్ట్ అవ్వవు. అయితే కరోనా కారణంగా అఖిల్ అక్కినేని చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్ర షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆ సినిమాలోని అతి ముఖ్యమైన లవ్ సీన్స్ మిగిలి ఉన్నాయని సమాచారం.
సినిమాలో కీలకంగా ఉండే లవ్ సీన్స్ ని చివర్లో తీసుకుందామని అనుకున్నారట. కానీ ఇప్పుడు అదే వారికి ఇబ్బందిగా మారింది. అసలు సిసలు సీన్లే మిగిలి ఉండడం చిత్ర బృందాన్ని ఆందోళనకి గురి చేస్తుంది. కరోనా ప్రభావం తగ్గి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ కుదరాలంటే మరింత సమయం పట్టేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాకి అన్ని సినిమాల కంటే మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.