Advertisementt

చిరు మూవీలో కాజల్ ఐటెమ్‌కు మాత్రమే!

Sun 22nd Mar 2020 06:00 PM
kajal,kajal agarwal,item song,chiru movie,aacharya  చిరు మూవీలో కాజల్ ఐటెమ్‌కు మాత్రమే!
Kajal Acts Item Song In Chiru Movie! చిరు మూవీలో కాజల్ ఐటెమ్‌కు మాత్రమే!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవితో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిరు 152 సినిమా కావడం.. ఇప్పటికే అన్ని చిత్రాల కొట్టిన కొరటాల దర్శకుడు కావడంతో మెగాభిమానులు, సినీ ప్రియుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం గ్యాప్ తీసుకున్న చిత్రబృందం.. హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఐటెం సాంగ్‌కు ఎవర్ని తీసుకోవాలనే ఆలోచనలు దర్శకనిర్మాతలు ఉన్నారట. ఇంకా హీరోయిన్ ఎవరనేది పూర్తి కాలేదు కానీ.. ఐటెం సాంగ్‌కు ఎవరనేది మాత్రం లీకులు బయటికొచ్చేశాయ్.!

త్రిష ఊహించని షాకివ్వడంతో కాజల్‌ను చిత్రబృందం సంప్రదించగా గట్టిగానే పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను వద్దనుకున్నారని.. స్వీటీ అనుష్కను తీసుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరోసారి కాజల్‌నే సంప్రదించారట. అయితే సినిమాలో హీరోయిన్‌గా కాదట.. ఐటెం సాంగ్‌కు మాత్రమేనట. మెగాస్టార్ సినిమా కావడంతో ఏదో ఒక అవకాశం వచ్చింది కదా..? అని ఆ బ్యూటీ ఒప్పుకునేసిందట. అంటే సింగిల్ సాంగ్‌కే కాజల్ పరిమితం అవుతుందన్న మాట. 

కాగా.. ఇలా ఐటెమ్ సాంగ్స్ చేయడం కాజల్‌కు కొత్తేమీ కాదు.. ఇదివరకే ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ‘పక్కా లోకల్.. పక్కా లోకల్’ అంటూ అందాల తెగ ఆరోబోసేసింది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పద మరి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చెర్రీ యంగ్ మెగాస్టార్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. మరోవైపు ఆయనకూ హీరోయిన్‌ కావాలని దర్శకనిర్మాతలు వేట సాగిస్తున్నారు. ఎప్పుడు దొరుకుతుందో..? ఎవర్ని కన్ఫామ్ చేస్తారో ఏమో మరి.

Kajal Acts Item Song In Chiru Movie!:

Kajal Acts Item Song In Chiru Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ