Advertisementt

పుకార్లు పట్టించుకోను.. కాపీ కొట్టాల్సిన అక్కర్లేదు!

Sun 22nd Mar 2020 03:27 PM
music director ss thaman,samaja varagamana,copy,tune copy  పుకార్లు పట్టించుకోను.. కాపీ కొట్టాల్సిన అక్కర్లేదు!
News About Music Director SS Thaman! పుకార్లు పట్టించుకోను.. కాపీ కొట్టాల్సిన అక్కర్లేదు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒక్కడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్.. థమన్ ఇద్దరూ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఏదైనా స్టార్ హీరోతో సినిమా అంటే చాలు మొదట చాయిస్ వీరిద్దరే.. ఒక వేళ డేట్స్ ఖాళీగా లేకపోతే తర్వాత నెక్ట్స్ ఎవరనేది ఆలోచిస్తుంటారు. అలా థమన్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. పోటీ పడి మరీ ఈ ఇద్దరూ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. తాజాగా ‘అల వైకుంఠపురములో..’ సినిమాకు థమన్.. ఇందుకు పోటీగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవీ శ్రీ  సంగీతం అందించారు. అలా పోటాపోటీగా ముందుకెళ్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. బన్నీ సినిమాలోని ‘సామజ వర గమన’ అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా యూట్యూబ్‌ను షేక్ చేసింది. అంతేకాదు.. ఈ సినిమా రిలీజ్ కాక మునుపు నుంచి ఇప్పటి వరకూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. ఈ సాంగ్‌కు సిద్ శ్రీరామ్ స్వరం అందివ్వగా.. థమన్ బాణీలు సమకూర్చాడు. అయితే.. ఈ రేంజ్‌లో జనాల్లోకి వచ్చిన సాంగ్‌ ట్యూన్‌ను కాపీ చేశారనే ప్రచారం పాట బయటికొచ్చినప్పట్నుంచి సాగింది. ఈ పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేసినప్పటికీ చిత్ర యూనిట్ గానీ.. థమన్ గానీ అస్సలు పట్టించుకోలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఈ కాపీ వ్యవహారం ప్రస్తావనకు రాగా క్లారిటీ ఇచ్చుకున్నాడు. ‘సామజ వర గమన’ సాంగ్ ఇంత బాగా రావడం వెనుక టీమ్ కృషి చాలానే ఉందని.. కానీ కొందరు పనిగట్టుకుని మరీ దీన్ని కాపీ ట్యూన్ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. అయితే అలాంటి పుకార్లు తాను పట్టించుకోనని.. అస్సులు కాపీ కొట్టాల్సిన అక్కర్లేదన్నాడు. అలాంటివాళ్లకి తాను ఏమీ రిప్లయ్ ఇవ్వనన్నాడు. ఒకవేళ తాను చేసింది కాపీ ట్యూన్ అయితే జనాలు ఈ స్థాయిలో ఎవరూ రిసీవ్ చేసుకోరన్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఈ ట్యూన్‌కు వచ్చిన స్పందనే ప్రచారం చేసే వారికి సమాధానం.. కౌంటర్ అన్నట్లుగా థమన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి చూస్తే థమన్ నోరు తెరవడంతో పుకార్లు, అతిగా ప్రచారం చేస్తున్న వారి నోళ్లకు తాళం పడిందన్న మాట.

News About Music Director SS Thaman!:

News About Music Director SS Thaman!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ