Advertisementt

విజయ్‌కి.. బాత్ టబ్ బేబీకి సంబంధమేంటి!?

Sat 21st Mar 2020 11:16 PM
vijay devarakonda,both tub biggboss baby,nandini rai,instagram,photos  విజయ్‌కి.. బాత్ టబ్ బేబీకి సంబంధమేంటి!?
News About Vijay Devarakonda Both Tub BiggBoss Baby! విజయ్‌కి.. బాత్ టబ్ బేబీకి సంబంధమేంటి!?
Advertisement
Ads by CJ

సినీ తారలు చేసే కొన్ని పనులు చిత్ర విచిత్రాలుగా ఉంటాయ్.. చాలా విడ్డూరంగానూ ఉంటాయ్.. కొన్ని కొన్ని సార్లు వాళ్లు చేసే చేష్టలే వారిని ఆకాశానికెత్తేస్తాయి.. ఇంకొన్ని అయితే ఎన్నెన్నో పుకార్లు పుట్టించి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంటాయ్. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇందుకు కారణం.. ఆయన బాత్ టబ్‌లో ఫొటోలు దిగడమే. ఇదేంటి.. ఫొటోలు దిగకూడదా..? దిగినంత మాత్రాన తప్పేముంది..? అని ఆలోచిస్తున్నారు కదూ..? తప్పేమీ లేదు కానీ.. ఎక్కడో సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అవ్వడంతో ఈ ఫొటోలు చివరికి నెట్టింట్లోకెక్కి.. వార్తల్లో నిలిచాయి.

నన్నూ గుర్తెట్టుకోండోయ్!

అసలు విషయానికొస్తే.. నందిని రాయ్ ‘బిగ్ బాస్’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసందే. వాస్తవానికి అప్పటికే హీరోయిన్‌గా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోగా.. ఈ షో కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకుంది. హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత కంటెస్టెంట్స్‌కు నలుగురైదుగురికి అవకాశాలు వచ్చాయి కానీ.. ఈ బ్యూటీని మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా చాన్స్ రాలేదు. దీంతో మళ్లీ మోడల్ రంగంలోకి దిగింది. ఇదిగో ఇలా హాట్ హాట్ ఫొటోలతో దర్శనమిచ్చి.. నేనున్నా.. నన్నూ పట్టించుకోండని దర్శకనిర్మాతలకు పరోక్షంగా గుర్తు చేస్తూ ఉంటుంది. మంచి హాట్ ఫొటోలు కావడంతో నెటిజన్లు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. తాజాగా.. బాత్ టబ్‌లో పడుకొని తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోలకు తెగ కామెంట్స్ వచ్చాయ్.. లైక్‌లు అంతకంటే ఎక్కువే వచ్చాయ్.

ఆ మరుసటి రోజే!

నందిని ఫొటోలు షేర్ చేసిన మరుసటి రోజే విజయ్ దేవరకొండ కూడా సేమ్ అదే యాంగిల్‌లో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలకూ పెద్ద ఎత్తున లైక్స్ వచ్చాయ్. ఒకరిద్దరు కాదండోయ్ ఏకంగా ఒక మిలియన్ లైక్స్ వచ్చాయ్. ఈ లైక్స్‌లో నందిని రాయ్ కూడా ఉండటం గమనార్హం. అయితే.. నందిని లాగే విజయ్ ఫోజులివ్వడం.. ఆ ఫొటోలను హాట్ బ్యూటీ లైక్ కొట్టడంతో నెటిజన్లంతా ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది..? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ఎక్కడో తేడా కొడుతోందే..? సమ్‌థింగ్.. సమ్‌థింగ్..? తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నందిని-విజయ్ బాత్ టబ్ ఫొటోల వ్యవహారం నెట్టింట్లో పెద్ద హాట్ టాపిక్‌ అయ్యింది. మరి ఈ ఫొటోల వెనుక అర్థం.. పరమార్థం ఆ ఇద్దరికే ఎరుక.

News About Vijay Devarakonda Both Tub BiggBoss Baby!:

News About Vijay Devarakonda Both Tub BiggBoss Baby!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ