నితిన్ మూడు డిజాస్టర్స్ తర్వాత భీష్మ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. అయితే భీష్మ రాంగ్ టైమింగ్ లో వదిలాడు కాబట్టి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాలేదు అన్నారు. నిజంగానే భీష్మ సినిమా గత డిసెంబర్ లోనో, మార్చి ఎండ్ లేదా ఏప్రిల్ లో విడుదల చేసినట్లయితే భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో కళకళలాడేది. కానీ పరీక్షల టైంలో, అన్ సీజన్ లో విడుదల చెయ్యడంతో భీష్మ కలెక్షన్ పరంగా బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. భీష్మ కామెడీ ఎంటర్టైనర్ గనక సూపర్ హిట్ గా కలెక్షన్స్ రాబట్టేది. అయితే ఇప్పుడు భీష్మ ఫిబ్రవరిలో విడుదలై మంచి పని చేసింది అనుకోవాలి.
లేదంటే భీష్మ సినిమా గనక మార్చ్ ఎండ్ లోనో, ఏప్రిల్ లోనో విడుదలై ఉంటే నితిన్ కి ఇప్పుడొచ్చిన కలెక్షన్స్ కూడా ఉండేవి కాదు. ఎందుకంటే మార్చి నెల ఆఖరిలో కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూత బడ్డాయి. సో ఇప్పుడు గనక విడుదల పెట్టుకుంటే భారీగా నష్టం వాటిల్లేది. ఇక ఏప్రిల్ అనుకుంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ ఏప్రిల్ లోనే వరస బెట్టేయి. సో అలా ఏప్రిల్ లో మంచి డేట్ కోసం భీష్మ మిగతా సినిమా నిర్మాతలతో కొట్టుకోవాల్సి వచ్చేది. ఇక అన్ సీజన్ లో అయినా భీష్మకి ఆ మాత్రం కలెక్షన్స్ రావడం భీష్మ అదృష్టమని చెప్పాలి.