విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో వచ్చిన వెంకీమామా చిత్రంలో వెంకటేష్ పాత్ర అందరికీ నచ్చింది. దాంతో ఆ సినిమా అలా అయిపోగానే మరో సినిమా మొదలెట్టాడ్య్ వెంకీ. తమిళంలో సూపర్ హిట్ సాధించిన అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ చాలా కొత్తగా కనిపిస్తాడట.
అనంతపురంలో షూటింగ్ ముగించుకున్న అనంతరం తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొని వచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ని కొన్ని రోజులు వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ పాత్ర హైలైట్ గా నిలుస్తుందట. నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ లోనూ లుక్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. పల్లెటూరి ప్రాంతానికి చెందిన వాడిగా వెంకటేష్ యాక్టింగ్ అదరగొట్టాడని టాక్
ఇంతకుముందు మనం చూడని వెంకటేష్ ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. వెంకీ పలికే భాష గానీ, హావాభావాలు గానీ అన్నీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయట. మరి ఇంతగా చెప్పుకుంటున్న ఈ సినిమా గురించి జనాల్లో ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది.