మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేసే సినిమా పనుల్లో నిమగ్మమై ఉన్నాడు. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అధికారికంగా రివీల్ కాకపోయినప్పటికీ ఈ చిత్రానికి అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ తో చిత్రం తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ మెగా హీరోతో సినిమా చేయనున్నాడట.
త్రివిక్రమ్ మెగా హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేశాడు. తాను దర్శకత్వం చేసిన పడకొండు సినిమాల్లో మూడు చిత్రాలు మినహా మిగతావన్నీ మెగా హీరోలతో చేసినవే. అందువల్ల ఎన్టీఆర్ తో సినిమా అనంతరం అతడు మళ్ళీ మెగా కాంపౌడ్ కే వచ్చేస్తాడని గట్టిగా వినిపిస్తుంది. అయితే మెగా హీరోలలో ఎవరితో చేసే విషయంలో కూడా ఒక క్లారిటీ ఉందని తెలుస్తుంది. అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్న మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంటున్నారు.
మెగాస్టార్ కి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుండో ఉందట. అందువల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని, అది కూడా ఎన్టీఆర్ సినిమా తర్వాతే ఉంటుందని చెబుతున్నారు.