Advertisementt

‘ఆచార్య’ విషయంలో చిరు తీవ్ర అసహనం!?

Sat 21st Mar 2020 03:18 AM
megastar,megastar chiru,angry,aacharya,koratala shiva,mahesh babu  ‘ఆచార్య’ విషయంలో చిరు తీవ్ర అసహనం!?
Megastar Angry On Aacharya Movie Issue! ‘ఆచార్య’ విషయంలో చిరు తీవ్ర అసహనం!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారా..? మూవీ దర్శకనిర్మాతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారా..? కొరటాల శివను కూర్చోబెట్టి మరీ క్లాస్ తీసుకున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇదంతా నిజమేనని తెలుస్తోంది. ఇంతకీ చిరు ఏ విషయంలో ఇంతగా సీరియస్ అయ్యారు..? అసలేం జరిగింది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

కోవిడ్-19 ఎఫెక్ట్!?

మెగాస్టార్ చిరంజీవితో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిరు 152 సినిమా కావడం.. ఇప్పటికే అన్ని చిత్రాల కొట్టిన కొరటాల దర్శకుడు కావడంతో మెగాభిమానులు, సినీ ప్రియుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో సినిమా వాయిదా వేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో అందరికంటే ముందుగా మెగాస్టారే ప్రకటించారు. ఆ తర్వాత కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిన మెగాస్టార్.. తాజాగా దీని తాలుకూ ఓ వీడియోను విడుదల చేశారు. 

ఎందుకిలా కొరటాలా!?

ఇదంతా సరే కానీ.. సినిమా విషయంలో షూటింగ్ మొదలుకుని ఇప్పటి వరకూ చాలానే ఆటంకాలు జరిగాయి. మరీ ముఖ్యంగా లుక్ విషయంలో.. రామ్‌చరణ్ తీసుకుంటున్నట్లు ఆ తర్వాత ఆయన్ను వద్దనుకుని సూపర్‌స్టార్ మహేశ్‌బాబును తీసుకుంటున్నట్లు ఇలా చాలానే లోలోపల జరిగినప్పటికీ.. మూడో కంటికి తెలియకూడదని చాలా జాగ్రత్తలు పాటించినప్పటికీ జరగాల్సింది మాత్రం జరిగిపోయింది. అంతేకాదు హీరోయిన్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో అసలేం జరుగుతోంది..? మనం సినిమా చేస్తున్నామా..? ఇంకేమైనా చేస్తున్నామా..? అసలు ఈ లీకులు చేస్తున్నదెవరు..? ఎంత జాగ్రత్తగా సీక్రెట్‌గా సాగిస్తున్నా ఎందుకిలా శివా..? అని కొరటాలకు గట్టిగానే చిరు క్లాస్ పీకారట. 

ఏం జరుగుతుందో..!?

త్రిష సినిమా యూనిట్‌కు షాకిచ్చిన తర్వాత అసలు ఆమె స్థానంలో ఎవర్ని తీసుకుంటున్నారు..? కాజల్‌నే తీసుకుంటున్నారా..? లేక అనుష్కను తీసుకుంటున్నారా..? అనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మరోవైపు యంగ్ మెగాస్టార్ పాత్రలో ఎవరనేదానిపై కూడా క్లారిటీ రాలేదు. దీంతో ఎప్పుడు ఎవరు సెట్ అవుతారో..? ఏం జరుగుతుందో అనే విషయం తెలియరాలేదు. మొత్తానికి చూస్తే ఈ కోవిడ్ ఎఫెక్ట్ గ్యాప్‌లో అన్నింటినీ కొరటాల సెట్ చేస్తాడా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.

Megastar Angry On Aacharya Movie Issue!:

Megastar Angry On Aacharya Movie Issue!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ