అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ పెళ్ళికి ముందే సమంత హీరో సిద్దార్ధ్ తో ప్రేమాయణం నడిపింది. చాలా ఏళ్ళు సిద్దార్ధ్, సమంతలు డేటింగ్ చేశారనే న్యూస్ ప్రచారం జరగడం.. ఒకానొక సమయంలో తమరిద్దరికి ఉన్న దోషాలను తొలగించుకోవడానికి గాను.. శ్రీకాళహస్తి వెళ్లి దోష పూజలు కూడా చేయించుకున్నారు. అయితే చైతుతో ప్రేమ పెళ్లి తర్వాత సిద్దార్ధ్ విషయాన్ని అందరూ పక్కనబెట్టేశారు. అసలు సమంత కూడా సిద్దుతో ఉన్న రిలేషన్ షిప్ ఫై ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ తాను బాధలో ఉన్నప్పుడు చైతు ఓదార్పు మరువలేనిది అంటూ చాలాసార్లే చెప్పింది. అయితే తాజాగా సమంత మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా ఓ పత్రికతో ముచ్చటించింది.
దానిలో భాగంగానే సీనియర్ హీరోయిన్ సావిత్రి జీవితంలో.. ఆమె ప్రేమ పేరుతో ఎలాంటి కష్టాలు అనుభవించారో నా జీవితంలో కూడా కష్టాలే చోటు చేసుకున్నాయంది. హీరో సిద్ధార్థ్‌తో తాను ప్రేమ విషయంలో విడిపోవడం ఎంతో మంచిదైందని అనడమే కాదు.. అతనితో తాను ఇంకా సంబంధాన్ని కొనసాగించి ఉంటే తన జీవితం మరో సావిత్రి జీవితంలా తయారయ్యేదంటూ సంచలనంగా మాట్లాడింది. సావిత్రి నిజ జీవితంలో ఏం జరిగిందో అలాంటిదే నా జీవితంలోను జరిగేది. కానీ విషయాన్నీ నేను ముందే పసిగట్టడం వలన బయటపడ్డాను. సిద్దార్ధ్ నుండి విడిపోవాలనే నిర్ణయం నా జీవితంలో అతి పెద్ద నిర్ణయమని చెబుతుంది. ఇక చైతు తనకు దేవుడిచ్చిన కానుక అంటూ సమంత చాలా రోజుల తర్వాత సిద్దార్ధ్ విషయాలపై పెదవి విప్పింది.
అయితే సావిత్రి పెళ్ళై పిల్లలున్న జెమిని గణేష్ ని పెళ్లి చేసుకుని తర్వాత భర్త చేతిలో మోసపోయి సినిమా జీవితంలోను అగాధంలో కూరుకుపోయినట్లుగా సమంత పెళ్ళై పిల్లలున్న సిద్దార్ధ్ ని నమ్మి ప్రేమించినా వాస్తవాన్ని తెలుసుకుని ఆ బంధం నుండి బయటికి రాబట్టే ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటూ చెబుతుంది.