Advertisementt

లవ్ స్టోరీలో సాయి పల్లవిని చైతన్య అందుకోగలడా..?

Fri 20th Mar 2020 04:20 AM
love story,shekar kammula,nagachaitanya,saipallavi  లవ్ స్టోరీలో సాయి పల్లవిని చైతన్య అందుకోగలడా..?
Will Nagachaitany beat Sail Pallavi? లవ్ స్టోరీలో సాయి పల్లవిని చైతన్య అందుకోగలడా..?
Advertisement
Ads by CJ

సెన్సిబుల్ ప్రేమ కథాచిత్రాల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల మరోసారి మనల్ని మాయ చేయడానికి లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల రెండేళ్ళు గ్యాప్ తీసుకుని మరీ చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ హెచ్ అందించిన పాటల్లో రిలీజైన హే పిల్లా పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్న చైతన్య ఈ సినిమా కోసం తెలంగాణ మాండలికాన్ని నేర్చుకున్నాడట.

నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఫిదా సినిమాలో సాయిపల్లవి తన నటనతో ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. అలాంటి నటనతోనే మళ్ళీ మాయ చేయగలదని తెలుసు. అయితే మరి నాగచైతన్య సాయిపల్లవి అందుకోగలడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయిపల్లవికే ఎక్కువ పేరు వచ్చింది. మరి ఈ సినిమాలో సాయిపల్లవిని అందుకోవాలంటే నాగచైతన్య పర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండాలి. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్  వీడియోలో నాగచైతన్య చాలా భిన్నంగా కనిపించాడు. ముద్దు పెట్టినపుడు అతడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ వీడియోకే హైలైట్ గా నిలిచింది. కాబట్టి సాయిపల్లవికి ధీటుగా చైతన్య పర్ ఫార్మెన్స్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు

Will Nagachaitany beat Sail Pallavi?:

Nagachaitanya performance at peaks in Love story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ